తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. అన్ని ఇండస్ట్రీలలో ఇప్పటికే కావాల్సినంత మంది వారసులు ఉన్నారు. కొంతమంది టాలెంట్ ఉన్నోళ్ళు స్టార్స్ అవుతున్నారు. మరికొందర్ని స్టార్స్ అయ్యే వరకు నిలబెడుతున్నారు. ఇంకొందరు మాత్రం ఎంత ప్రయత్నించినా అలాగే ఉండిపోయారు. బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా వాళ్లు సక్సెస్ కాలేదు. ఇదిలా ఉంటే తాజాగా మరో వారసుడు కూడా ఇండస్ట్రీకి వస్తున్నాడు. అతనెవరో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకు గణేష్ బాబు త్వరలోనే ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. ప్యాండమిక్ వచ్చి ప్లాన్స్ అన్నీ పాడు చేసింది కానీ లేదంటే ఇప్పటికే ఈయన సినిమా కూడా విడుదలకు సిద్ధమై ఉండేది. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం బెల్లంకొండ గణేష్ త్వరలోనే ఓ రీమేక్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అన్న బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగులో 15 ఏళ్ల కింద వచ్చిన ఛత్రపతి సినిమాను హిందీకి తీసుకెళ్తుంటే.. తమ్ముడు గణేష్ మాత్రం 15 ఏళ్ళ కింద హిందీలో వచ్చిన వివాహ్ సినిమాను తెలుగు ఇండస్ట్రీకి తీసుకొస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
షాహిద్ కపూర్, అతిథి హీరోయిన్ అమృతా రావు జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. అరేంజెడ్ మ్యారేజెస్ గురించి ఈ సినిమా సాగుతుంది. ఈ రీమేక్ హక్కులను ఇప్పుడు బెల్లంకొండ సురేష్ తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఇదే సినిమాను తెలుగులో తన కొడుకు గణేష్ బాబు, ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టితో రీమేక్ చేయాలని చూస్తున్నాడు ఈయన. ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నాలు కూడా మొదలైపోయాయి. త్వరలోనే పూర్తి వివరాలు బయటికి రానున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.