బిగ్ బాస్‌పై బండ్ల గణేష్ సంచలన ట్వీట్

బండ్ల గణేష్ ఫైల్ ఫోటో

అన్నకు పాదాభివందనం అంటూ చిరంజీవిని ఉద్దేశిస్తూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.

  • Share this:
    సినీనటుడు, కమెడియన్‌గా మెప్పించి, అనేక సినిమాలకు తీసి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన బండ్ల గణేష్ మరోసారి తెరపైకి వచ్చారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమాపై సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. తెలుగువాడి సత్తాను మరోసారి సినీ ప్రపంచానికి చాటిచెప్పిన మా సైరా అన్నకు పాదాభివందనం అంటూ చిరంజీవిని ఉద్దేశిస్తూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. అంతకు ముందు రామ్ చరణ్ ‌పై కూడా బండ్ల ట్వీట్ చేశారు. ‘మళ్ళీ మీతో ఒక సినిమా తీసి ఆ సినిమాను బ్లాక్ బస్టర్ సినిమాగా ప్రజల ముందు ఉంచాలని ఆ అవకాశం లిటిల్ బాస్ నాకు త్వరగా ఇవ్వాలని కోరుకుంటూ మీ బండ్ల గణేష్’ అంటూ తన అభ్యర్ధనను తన ట్విట్ ద్వారా తెలిపారు బండ్ల గణేష్

    గతంలో రామ్ చరణ్‌తో కలిసి బండ్ల గణేష్ 'గోవిందుడు అందరివాడేలే' సినిమా తీశారు. ఈ నేపథ్యంలో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న బండ్ల గణేష్.. రామ్‌చరణ్‌తో మరో బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తీయాలని ఉందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 'మరో ఛాన్స్ ఇవ్వండి లిటిట్ బాస్'.. అంటూ రామ్‌చరణ్‌ను ట్విటర్ వేదికగా రిక్వెస్ట్ చేశారు. ఆ అవకాశాన్ని త్వరగా ఇవ్వాలని కోరారు బండ్ల గణేష్. మరి ఆయన విజ్ఞప్తికి రామ్‌చరణ్ స్పందించి సినిమాను నిర్మించే అవకాశాన్ని ఇస్తారో లేదో చూడాలి.    Published by:Sulthana Begum Shaik
    First published: