టాలీవుడ్లో కరోనా వైరస్ బారిన పడ్డ తొలి ప్రముఖుడు బండ్ల గణేష్. హెయిర్ ప్లాంటేషన్ కోసం వెళ్లిన ఆయనకు అనుకోకుండా కరోనా అటాక్ అయింది. దాంతో వెంటనే చికిత్స తీసుకున్నాడు ఈయన. ఇప్పుడు తనకు కరోనా నుంచి బయట పడ్డానంటూ ఈ నిర్మాత సొషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. పూర్తిగా కోలుకున్నట్లు అభిమానులకు తెలిపాడు ఈయన. ఇదే ఈ విషయాన్ని సోషల్ మీడియా పేజీలో అభిమానులతో పంచుకున్నాడు బండ్ల గణేష్. అలాగే తనకు త్వరగా నయం చేసినందుకు భగవంతునికి ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చాడు ఈయన.
Thanks god 🙏🙏🙏🙏🙏 pic.twitter.com/XLNv57nVEr
— BANDLA GANESH. (@ganeshbandla) June 30, 2020
అపోలో డయోగ్నోస్టిక్స్‌లో కరోనా నిర్దారణ పరీక్షలకు సంబంధించిన రిపోర్ట్‌ను కూడా షేర్ చేసాడు బండ్ల. అందులో ఆయనకు కరోనా తగ్గినట్టుగా తేలింది. ఈ మధ్యే బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. ముఖ్యంగా టాలీవుడ్ అంతా ఉలిక్కిపడింది. వెంటనే ఆయనను కలిసిన వాళ్లలో కూడా ఆందోళన మొదలైంది. వాళ్లు కూడా టెస్టులు చేయించుకున్నారు. ఏదేమైనా కూడా త్వరగానే కరోనా నుంచి బయటపడ్డాడు బండ్ల గణేష్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandla Ganesh, Coronavirus, Telugu Cinema, Tollywood