హోమ్ /వార్తలు /సినిమా /

మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. KCRపై బండ్ల గణేష్ ట్వీట్..

మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. KCRపై బండ్ల గణేష్ ట్వీట్..

సిఎం కేసీఆర్, బండ్ల గణేష్ (cm kcr bandla ganesh)

సిఎం కేసీఆర్, బండ్ల గణేష్ (cm kcr bandla ganesh)

Bandla Ganesh: తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఫన్నీయెస్ట్ ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ బండ్ల గణేష్. ఈయనేం చేసినా కూడా నవ్వు వచ్చేస్తుంది. సినిమాల్లో కామెడీ చేసినట్లు బయట కూడా చేస్తుంటాడు బండ్ల.

తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఫన్నీయెస్ట్ ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ బండ్ల గణేష్. ఈయనేం చేసినా కూడా నవ్వు వచ్చేస్తుంది. సినిమాల్లో కామెడీ చేసినట్లు బయట కూడా చేస్తుంటాడు బండ్ల. అయితే ఈయనకు సినిమాలతో పాటు మరో వ్యాపారం కూడా ఉంది. అదే ఫౌల్ట్రీ బిజినెస్. తెలంగాణలో ఫౌల్ట్రీ బిజినెస్ శాసించే స్థాయిలో ఉన్నాడు బండ్ల గణేష్. ఈయన బిజినెస్ రేంజ్ కూడా పెద్దదే. అయితే ఇప్పుడు కరోనా కారణంగా కొన్ని రోజులుగా ఫౌల్ట్రీ వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. చికెన్ తింటే కరోనా వస్తుందనే ప్రచారం జోరందుకోవడంతో చాలా మంది అటు వైపు వెళ్లడం మానేసారు.


అందుకే వందలకు వందలు ఉండే చికెన్ రేట్ రూ. 40 కు పడిపోయింది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్‌తో పాటు ఇంకా చాలామంది ప్రముఖులు చికెన్ తింటే ఏం కాదని జనాన్ని కోరుతున్నారు. ఆ మధ్య హైదరాబాద్‌లో చికెన్ ఫెస్టివల్ కూడా చేసారు. ఇక ఇప్పుడు చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందని దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వాటి అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. ఈ దుష్ప్రచారాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రెస్ మీట్‌లో ఖండించాడు.


అందుకే ఫౌల్ట్రీ కింగ్, పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్స్ అధినేత, ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఓ ఆసక్తికర ట్వీట్ పోస్ట్ చేశాడు. మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్ మీ సహాయానికి పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్స్.. బండ్ల గణేష్ నమస్కారం అంటూ తెలంగాణ CMOను ట్యాగ్ చేస్తూ ఓ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌తో పాటు సీఎం కేసీఆర్ ఫొటోను.. ఆయన చికెన్ గురించి చెబుతున్న వీడియోను కూడా జత చేసాడు బండ్ల గణేష్. ఇది చూసి కొందరు బండ్ల గణేష్ ఈజ్ బ్యాక్ అంటూ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు.

First published:

Tags: Bandla Ganesh, CM KCR, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు