వరుణ్ తేజ్ హీరోగా థియేటర్లలో హల్ చల్ చేస్తున్న ‘సినిమా గద్దలకొండ గణేష్’. ఈసినిమా రిలీజ్ అయినప్పటి నుంచి మంచి టాక్ తెచ్చుకుంది. అంతా వరుణ్ తేజ్ యాక్షన్ సూపర్బ్ అంటు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఈ సినిమాపై ట్వీట్ చేశారు. ‘ గద్దలకొండ గనేష్ సినిమాను చూసి ఎంజాయ్ చేశానని. గద్దలకొండ గణేష్‌గా వరుణ్ తేజ్ యాక్షన్ అదిరిందింటూ ట్వీట్ చేశాడు. డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా అద్భుతంగా పనిచేశారంటూ కొనియాడారు. గద్దలకొండ గణెష్ సినిమా టీం అంతటికి శుభాకాంక్షలు తెలిపారు. అయితే మహేష్ చేసిన ట్వీట్‌కు డైరెక్టర్ హరీష్ శంకర్ రిప్లై ఇచ్చారు. మీ అభిమానానికి ధన్యవాదాలు అంటూ హరీష్ కూడా ట్వీట్ చేశారు. స్టార్ హీరోలంతా గద్దలకొండ గణేష్ సినిమాను ప్రశంసించడం పట్ల ఆయన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Thoroughly enjoyed watching #GaddalaKondaGanesh! @IAmVarunTej as Ganesh was exceptional👌 Great work by @harish2you and @14ReelsPlus 👏👏 Congratulations to the entire team on the well-deserved success 👍👍👍
— Mahesh Babu (@urstrulyMahesh) September 24, 2019
— Harish Shankar .S (@harish2you) September 24, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gaddalakonda Ganesh Movie, Harish Shankar, Mahesh babu, Mahesh Babu Latest News, Tollywood, Valmiki, Valmiki Movie Review