Home /News /movies /

TOLLYWOOD PRINCE MAHESH BABU TWEET ON CHANDRAYAAN 2 WITH MAHARSHI MOVIE DIALOGUES SB

‘మహర్షి’ డైలాగ్స్‌తో ... చంద్రయాన్‌ 2పై మహేష్ బాబు ట్వీట్

చంద్రయాన్ 2 పై మహేష్ బాబు ట్వీట్

చంద్రయాన్ 2 పై మహేష్ బాబు ట్వీట్

    చివరి నిమిషంలో చంద్రయాన్ 2కు ఆటంకం ఏర్పడటంతో యావత్ దేశం ఇస్రో శాస్త్రవేత్తలకు బాసటగా నిలిచింది. ప్రధాని మోదీ నుంచి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు అంతా ఇస్రోకు అండగా నిలిచింది. మీరు ఓడిపోలేదు.. నిరాశ వద్దు అంటూ.. అంతా వారికి భరోసా కల్పించారు. ఈ నేపథ్యంలో కొందరు సినీ సెలబ్రిటీలు కూడా ఇస్రో శాస్త్రవేత్తలపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా ఇస్రో సైంటిస్టులను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు.‘సక్సెస్ ఈజ్ నాట్ ల డెస్టినేషన్ ఇట్స్ ఏ జర్నీ’ అంటూ... మహర్షి సినిమా డైలాగ్స్‌తో ట్వీట్ చేశారు మహేష్. చంద్రయాన్ 2తో చారిత్రాత్మక ప్రయాణం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలందరికీ నా సెల్యూట్ అన్నారు మహేష్. మీరు నిజమన హీరోలు అంటూ కొనియాడారు. మేం మీతో ఉన్నాం అంటూ భరోసా ఇచ్చారు. ఇది మీ విజయానికి జస్ట్ ప్రారంభం మాత్రమే అంటూ ట్వీట్ చేశారు మహేష్.

    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Chandrayaan-2, ISRO, Maharshi, Mahesh babu, Mahesh Babu Latest News

    తదుపరి వార్తలు