Home /News /movies /

TOLLYWOOD PRINCE MAHESH BABU SAVE 30 CHILDREN LIVES IN ONE DAY SB

సరిలేరు నీకెవ్వరు.. ఒకే రోజు 30మంది ప్రాణాలు కాపాడిన మహేశ్ బాబు

మహేశ్ బాబు

మహేశ్ బాబు

ఏపీ గవర్నర్‌తో పాటు.. ఆంధ్రా ఆస్పత్రి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు మహేశ్ బాబు సతీమణి నమ్రత. దీంతో మహేశ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

    టాలీవుడ్ ప్రముఖ నటుడు మహేశ్‌బాబు మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటికే అనేకమందిని ఆదుకుంటున్న మన టాలీవుడ్ ప్రిన్స్ మరోసారి 30మంది ప్రాణాల్ని కాపాడాడరు. ఒకే రోజు 30 మంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపారు. నిన్న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నారులందరికీ గుండె ఆపరేషన్లు చేయించారు. మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఆంధ్రా ఆసుపత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు నమ్రతా.

    మహేశ్ చేసిన ఈ పనిపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మహేశ్ బాబు గ్రేట్ అని కొనియాడుతున్నారు. ఎంబీ ఫౌండేషన్ పేరుతో మహేశ్‌బాబు ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అనేక మందికి ఉచితంగా వైద్య సాయం చేశారు. ఎంతో మంది చిన్నారుల ప్రాణాలు కాపాడారు. ఎంతోమంది చిన్నారులకు ఈ ఫౌండేషన్ ద్వారా ఆపరేషన్లు చేయిస్తూ అండగా నిలుస్తున్నారు. మహేశ్ చేసిన ఈ పనులపై అతని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో తమ స్టార్ హీరోను పొగుడుతూ పోస్టులు పెడుతున్నారు.

    మరోవైపు మహేశ్ కొత్త సినిమాల్లో బిజీగా మారారు. సరిలేరు నికెవ్వరూ తర్వాత మహేశ్ చేస్తున్న మూవీ సర్కారు వారి పాట. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు పరుశురామ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక మహా నటి కీర్తి సురేశ్ మహేశ్ పక్కన హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఫ్యాన్స్‌ను కనువిందు చేశాయి. పాటలు కూడా వైరల్‌గా మారాయి. ఈ సినిమా కోసం మహేశ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ వేసవిలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. సర్కారు వారి పాట సినిమా మే 12వ తేదీన రిలీజ్‌ కానున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది. ఈ మేరకు మూవీ యూనిట్‌ రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేస్తూ సోషల్‌ మీడియాల్లో పోస్ట్స్‌ చేసింది. ఈ మూవీని జీఎండీ ఎంటర్‌‌టైన్‌మెంట్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌తో పాటు మైత్రీ మూవీ మేకర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Mahesh Babu, Namrata Shirodkar, Sarkaru Vaari Paata, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు