హోమ్ /వార్తలు /సినిమా /

సమయం ఎలా గడిచిపోయిందో... మహేష్ బాబు ఆసక్తికరమైన ట్వీట్

సమయం ఎలా గడిచిపోయిందో... మహేష్ బాబు ఆసక్తికరమైన ట్వీట్

గౌతమ్‌తో మహేష్ బాబు (Mahesh Babu Gautam)

గౌతమ్‌తో మహేష్ బాబు (Mahesh Babu Gautam)

సమయం ఎలా గడిచిపోయిందో తెలియడం లేదు. లవ్ యూ మై బాయ్ గౌతమ్" అంటూ మహేష్ ట్వీట్ చేశారు.

  టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు మరో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. తన కుమారుడు గౌతమ్ పుట్టినరోజు సదర్భంగా ఆయన ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.  గౌతమ్ టీనేజ్ లోకి వచ్చిన సందర్భంగా భావోద్వేగం నిండిన ట్వీట్ పెట్టగా, అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిన్న గౌతమ్ 13వ ఏట అడుగు పెట్టగా, ఆ విషయాన్ని నమ్రత తెలియజేస్తూ, తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఫోటోలను షేర్ చేశారు. తాజాగా మహేష్ కూడా ఇవాళ  తన కుమారుడుతో దిగిన ఓ ఫోటోను తన ఫ్యాన్స్‌కు షేర్ చేశారు.

  "ఇదే బెస్ట్ ఎవర్ పిక్చర్. నువ్విప్పుడు టీనేజ్ లోకి వచ్చావు. సమయం ఎలా గడిచిపోయిందో తెలియడం లేదు. లవ్ యూ మై బాయ్ గౌతమ్" అంటూ మహేష్ ట్వీట్ చేశారు. మహర్షి సూపర్ హిట్ తర్వాత మహేశ్ 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో నటిస్తున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రిన్స్‌కు తొలిసారిగా రష్మిక జతకట్టింది. ఇక రాములమ్మ విజయశాంతి, తన సెకండ్ ఇన్నింగ్స్ ను కూడా ఈ సినిమాతోనే ప్రారంభించడం మరో విశేషం.

  Published by:Sulthana Begum Shaik
  First published:

  Tags: Mahesh babu, Namrata, Tollywood, Tollywood Movie News, Tollywood news

  ఉత్తమ కథలు