Actor Rajababu passed away: టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ నటుడు రాజబాబు కన్నుమూత..

సీరియల్ నటుడు రాజబాబు కన్నుమూత (rajababu death)

Actor Rajababu passed away: టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు రాజబాబు (Actor Rajababu passed away) కన్నుమూశారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. కొన్నేళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సినిమాలతో పాటు పలు సీరియళ్లలో కూడా నటించి మెప్పించారు.

  • Share this:
టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు రాజబాబు కన్నుమూశారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. కొన్నేళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో అక్టోబర్ 24 రాత్రి ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తెలుగు ఇండస్ట్రీలో మృధుస్వభావిగా రాజాబాబుకు పేరుంది. ఆయన సినిమాల కంటే ఎక్కువగా సీరియల్స్‌తోనే గుర్తింపు సంపాదించుకున్నారు. రాజబాబుకు భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉంది. 1957 జూన్‌ 13న జన్మించిన రాజబాబుకు చిన్నప్పటి నుంచే నాటకాలు అంటే పిచ్చి. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నరసాపురపేటలో ఈయన జన్మించారు. రాజబాబు తండ్రి పేరు రామతారకం. రాజబాబుకు బాల్యం నుంచే రంగస్థలం మీద నటించడం అంటే ఎంతో ఇష్టం. అందుకే చిన్ననాటి నుంచి సినిమాలతో మమేకం అయిపోయారు. అప్పటి నుంచే ఇండస్ట్రీకి రావాలనుకున్నారు.

ఈ క్రమంలోనే ఆయనకు 1995లో శ్రీకాంత్ హీరోగా వచ్చిన ఊరికి మొనగాడు చిత్రంతో రాజబాబు సినిమా రంగానికి పరిచయం అయ్యారు. ఆ తర్వాత కృష్ణవంశీ సినిమాల్లో బాగా గుర్తింపు తెచ్చుకున్నారు రాజబాబు. ఆయన తెరకెక్కించిన సింధూరం, సముద్రం, మురారి సినిమాల్లో కనిపించారు. అలాగే వెంకటేష్ హీరోగా వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.. శర్వానంద్ శ్రీకారం.. మహేష్ బాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కళ్యాణ వైభోగం, మళ్ళీ రావా?, బ్రహ్మోత్సవం, భరత్ అనే నేను లాంటి సినిమాల్లో నటించారు. దాదాపు 62 చిత్రాల్లో విభిన్నమైన పాత్రలను పోషించారు రాజబాబు.

Tollywood Director - Heroine: హీరోయిన్‌తో ఆ అగ్ర దర్శకుడి ఎఫైర్.. ఇంట్లో ఇల్లాలు బయట ప్రియురాలు..


Neha Sharma: ‘చిరుత’ హీరోయిన్ నేహా శర్మ చేసిన తప్పులేంటి.. అందుకే సక్సెస్ కాలేదా..?


సినిమాలతో పాటు పలు సీరియళ్లలో కూడా నటించి మెప్పించారు. వసంత కోకిల, అభిషేకం, రాధా మధు, మనసు మమత, బంగారు కోడలు, బంగారు పంజరం, నా కోడలు బంగారం, చి ల సౌ స్రవంతి తదితర ధారావాహికల్లో ఆయన నటించారు. 2005లో అమ్మ సీరియల్‌లోని నటనకు గానూ ఆయనకు నంది అవార్డు కూడా వచ్చింది. తెర మీద గంభీరంగా కనిపించే రాజబాబు నిత్య జీవితంలో చాలా సరదా మనిషి. రాజబాబును అందరూ బాబాయ్‌ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కన్నుమూయడంతో తోటి నటీనటులు కన్నీరు పెట్టుకుంటున్నారు. చాలా మంచివారు అంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రాజబాబు మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు.
Published by:Praveen Kumar Vadla
First published: