హోమ్ /వార్తలు /సినిమా /

Jakkula Nageswara Rao: టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రమాదంలో ప్రముఖ నిర్మాత దుర్మరణం..

Jakkula Nageswara Rao: టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రమాదంలో ప్రముఖ నిర్మాత దుర్మరణం..

జక్కుల నాగేశ్వరరావు (Jakkula Nageswara Rao)

జక్కుల నాగేశ్వరరావు (Jakkula Nageswara Rao)

Jakkula Nageswara Rao: తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య వరస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోజూ ఏదో ఓ చేదు వార్త వినిపిస్తూనే ఉంది. శివశంకర్ మాస్టర్ (Shiva Shankar Master), సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela), కేఎస్ నాగేశ్వరరావు లాంటి ప్రముఖులు కన్నుమూసారు. తాజాగా మరో నిర్మాత యాక్సిడెంట్‌లో దుర్మరణం పాలయ్యాడు.

ఇంకా చదవండి ...

తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య వరస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోజూ ఏదో ఓ చేదు వార్త వినిపిస్తూనే ఉంది. మొన్నటికి మొన్న శివశంకర్ మాస్టర్, ఆ తర్వాత సిరివెన్నెల సీతారామశాస్త్రి, దానికి ముందు దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు లాంటి ప్రముఖులు కన్నుమూసారు. వీళ్ళ మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ విషాదంలోకి వెళ్లిపోయింది. మధ్యలో హీరో కిరణ్ అబ్బవరం అన్నయ్య కూడా రోడ్డు ప్రమాదంలో కన్నుమూసాడు. ఇలా వరస మరణాలతో ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. తాజాగా మరో నిర్మాత కూడా కన్నుమూసాడు. చిన్న సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న జుక్కుల నాగేశ్వరరావు అనే నిర్మాత యాక్సిడెంట్‌లో దుర్మరణం పాలయ్యాడు. కేవలం 46 ఏళ్ళ వయసులోనే ఈయన చనిపోవడం దారుణం. డబ్బింగ్ చిత్రాలతో ఈయన నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. నిర్మాత నాగేశ్వరరావుకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగేశ్వరరావు అక్కడిక్కడే మరణించారు. ఆయన మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం అలముకుంది. లవ్ జర్నీ, వీడు సరైనోడు, అమ్మా నాన్నా ఊరెళితే లాంటి సినిమాలను నిర్మించాడు జక్కుల నాగేశ్వరరావు. దాంతో పాటు కొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా తీసుకొచ్చాడు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు