హోమ్ /వార్తలు /movies /

Panchathantram song: బ్రహ్మానందం, కలర్స్ స్వాతి ‘పంచతంత్రం’ నుంచి పాట విడుదల..

Panchathantram song: బ్రహ్మానందం, కలర్స్ స్వాతి ‘పంచతంత్రం’ నుంచి పాట విడుదల..

Panchathantram song: కళాబ్రహ్మ బ్రహ్మానందం (Brahmanandam), సముద్రఖని, స్వాతి రెడ్డి (Colors Swathi), శివాత్మిక రాజశేఖర్ (Shivatmika Rajasekhar), యువ హీరో రాహుల్‌ విజయ్‌ (Rahul Vijay), ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం ‘పంచతంత్రం’.

ఇంకా చదవండి ...

    కళాబ్రహ్మ బ్రహ్మానందం (Brahmanandam), సముద్రఖని, స్వాతి రెడ్డి (Colors Swathi), శివాత్మిక రాజశేఖర్ (Shivatmika Rajasekhar), యువ హీరో రాహుల్‌ విజయ్‌ (Rahul Vijay), ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం ‘పంచతంత్రం’. టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హర్ష పులిపాక దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు నిర్మాతలు. ఇంతకుముందు బ్రహ్మానందంపై మేము విడుదల చేసిన ప్రచార చిత్రాలు,ఫ‌స్ట్ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఈ రోజు మార్చి 5న సినిమాలోని "ఏ రాగమో నన్నే.. రమ్మని పిలుస్తున్నదే.." సాంగ్ ను విడుదల చేశారు.

    ఏ.. రాగమో..నన్నే.. రమ్మని పిలుస్తున్నదే... ఏ వేగమో.. గతాన్నే స్వా..గతించే పదంలో..

    సా..గుతుంటే తమాషా.. చేరువైతే

    రుచులలో స్మృతులే తిరిగి కలవగ కలిసే ఆడుగే పడితే అనందంలోన పరుగే మొదలే మజిలీ వెతికే కథలో...

    లిరికర్ వీడియో సాంగ్ కు ప్రశాంత్‌ ఆర్‌. విహారి, శ్రవణ్ భరద్వాజ్ లు ఇచ్చిన మ్యూజిక్ చాలా వినసొంపుగా ఉంది.ఈ పాటని రవి, ప్రశాంత్‌ ఆర్‌. విహారి, లక్మీ మేఘన,శ్రీ కావ్య తదితరులు ఆలపించారు. రాజ్ కె నల్లి కెమెరా విజువల్స్ ఫ్రెష్ ఫీల్స్ ఇస్తున్నాయి.

    ఈ సందర్భంగా నిర్మాతలు సృజన్‌ ఎరబోలు, అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ.. "ఆల్రెడీ విడుదల చేసిన ప్రచార చిత్రాలు,ఫ‌స్ట్ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుండి పెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు వస్తున్న ఏ రాగమో సాంగ్ కూడా అదే స్థాయిలో అలరిస్తుందనే నమ్మకం ఉంది.బ్రహ్మానందం గారు ఎన్నో పాత్రల్లో నటించి ప్రేక్షకులను నవ్వించారు. అలాగే ఆయనలో అద్భుతమైన నటుడు ఉన్నారు. వెయ్యి చిత్రాలకు పైగా చేసిన బ్రహ్మానందం గారు మా సినిమాలో వేదవ్యాస్ గా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నందుకు మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని అన్నారు. చాలా సంవత్సరాల తర్వాత కలర్స్ స్వాతి రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా ఇది. మరోవైపు ఇందులో బ్రహ్మానందం పాత్ర కూడా చాలా కొత్తగా ఉండబోతుంది. ఇన్నేళ్లు కమెడియన్‌గా చూసిన ఈయన్ని.. ఇప్పుడు మరింత కొత్తగా చూపించబోతున్నారు. సీరియస్ పాత్రలో కనిపించబోతున్నారు బ్రహ్మానందం. ఆయనతో పాటు సముద్రఖని కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

    First published:

    ఉత్తమ కథలు