Home /News /movies /

TOLLYWOOD NEWS S ORIGINALS PRODUCTION HOUSE BECOMING BIGGER IN 2022 PK

S Originals: య‌స్ ఓరిజిన‌ల్స్ ప్రొడక్షన్ హౌస్ దూకుడు.. 2022లో విడుదల కానున్న 9 సినిమాలు..

యస్ ఒరిజినల్స్ నిర్మాత సృజన్ (S originals Srujan)

యస్ ఒరిజినల్స్ నిర్మాత సృజన్ (S originals Srujan)

S Originals: కంటెంట్ ఓరియంటెడ్ సినిమాల‌తో త‌న‌దైన ముద్ర‌ను సొంతం చేసుకున్న య‌స్ ఓరిజిన‌ల్స్ ఈ సంవ‌త్స‌రంలో మ‌రింత వేగం చూపించ‌బోతుంది. ఏకంగా 9 సినిమాలు ఈ సంవ‌త్స‌రంలో య‌స్ ఓరిజిన‌ల్స్ బ్యాన‌ర్ నుంచి విడుద‌ల‌కు సిద్దం అవుతున్నాయి.

ఇంకా చదవండి ...
కంటెంట్ ఓరియంటెడ్ సినిమాల‌తో త‌న‌దైన ముద్ర‌ను సొంతం చేసుకున్న య‌స్ ఓరిజిన‌ల్స్ ఈ సంవ‌త్స‌రంలో మ‌రింత వేగం చూపించ‌బోతుంది. ఏకంగా 9 సినిమాలు ఈ సంవ‌త్స‌రంలో య‌స్ ఓరిజిన‌ల్స్ బ్యాన‌ర్ నుంచి విడుద‌ల‌కు సిద్దం అవుతున్నాయి. ప్ర‌తి సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్నాయి. కాన్సెప్ట్‌ని న‌మ్మి కొత్త త‌రం ద‌ర్శ‌కుల‌ను ప‌రిచ‌యం చేస్తూ టాలీవుడ్‌లో త‌న ముద్ర‌ను మ‌రింత బ‌లంగా వేయ‌బోతుంది. ఇప్ప‌టికే య‌స్ ఓరిజిన‌ల్స్ అంటే కొత్త త‌రం క‌థ‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అనే మాట టాలీవుడ్ అంత‌టా విన‌ప‌డుతుంది. కొత్త సంవ‌త్స‌రంలో అడుగు పెడుతున్న సంద‌ర్భంగా త‌మ సంస్థ‌ నుంచి రాబోతున్న సినిమా విశేషాలపై నిర్మాత సృజ‌న్ య‌ర‌బోలు మాట్లాడుతూ.. య‌స్ ఓరిజిన‌ల్స్‌ను టాలీవుడ్‌లో ప్ర‌త్యేక స్థానంలో నిలుపాల‌న్న‌దే నా కోరిక‌.

ఇప్ప‌టి వ‌ర‌కూ భాగ‌స్వామ్యంలో కొన్ని సినిమాల‌ను నిర్మించ‌డం జ‌రిగింది. కానీ ఇప్ప‌డు య‌స్ ఓరిజిన‌ల్స్ బ్యాన‌ర్ నుంచే ఈ యేడాది 9 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాల షూటింగ్స్ దాదాపుగా ముగింపుకు రావ‌డం చాలా సంతోషంగా ఉంది. మా బ్యాన‌ర్ నుంచి రాబోతున్న ఈ సినిమాలతో కొత్త ద‌ర్శ‌కులు ప‌రిచ‌యం కాబోతున్నారు. టాలెంట్‌పై న‌మ్మ‌కంతో వారిని ప్రోత్స‌హించ‌డం జ‌రిగింది. ఇవే కాకుండా మ‌రికొన్ని క‌థ‌ల‌ను ఫైన‌లైజ్ చేయ‌డం జ‌రిగింది వాటిని ఈ సంవత్సరం ప్రారంభించ‌డం జ‌రుగుతుంది.

Vicky Kaushal: మొన్నే పెళ్లైంది.. అప్పుడే పోలీస్ కంప్లైంట్.. వివాదంలో విక్కీ కౌశల్..



ఇప్ప‌డు విడుద‌ల‌కు సిద్దం అవుతున్న సినిమాలు బ్ర‌హ్మానందం, కలర్స్ స్వాతి, స‌ముద్ర‌ఖ‌ని, శివాత్మిక రాజ‌శేఖ‌ర్, రాహుల్ విజ‌య్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తున్న పంచ‌తంత్రం, యూత్‌లో స్పెషల్ క్రేజ్ సొంతం చేసుకున్న సంతోష్ శోభ‌న్ హీరోగా, ఎమ్ ఆర్ ప్రొడక్షన్ తో డిజిటల్ మీడియాలో బ్రాండ్‌గా ఎదిగిన సుభాష్ ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యం చేస్తూ ఒక అంద‌మైన ప్రేమ‌క‌థ‌ను రూపోందించాము. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నుల‌లో ఉంది.

RRR movie: ఆ చెత్త రికార్డు మాత్రం ‘ట్రిపుల్ ఆర్’ ఖాతాలోనే.. పాపం ఎవరు మాత్రం చేస్తారు..?


ఒక కొత్త కాన్సెప్ట్‌తో సుమంత్ హీరోగా రూపొందుత‌న్న అహాం సినిమా షూటింగ్ ఆఖ‌రి షెడ్యూల్ జ‌రుగుతుంది. కొత్త ద‌ర్శ‌కుడు బ్రిజేష్ ద‌ర్శ‌క‌త్వంలో వైర‌ల్, బ్ర‌హ్మానందం త‌న‌యుడు గౌత‌మ్ హీరోగా చేస్తున్న సినిమా షూటింగ్ మొద‌టి షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ఈ సినిమాతో సుబ్బు చెరుకూరి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. గ‌తం సినిమాతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందిన కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో అదే టీంతో మ‌రో సినిమా రూపొందిస్తున్నాము. ఆ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది.

Rana 1945 movie: సంక్రాంతి బరిలో రానా ‘1945’.. ఎప్పటి సినిమా ఎప్పుడొస్తుంది సామి..?


వీటితో పాటు క‌న్న‌డంలో బీర్బల్ ట్రియాలజీ తీసిన ద‌ర్శ‌కుడు శ్రీని ద‌ర్శ‌క‌త్వంలో ఓల్డ్ మంక్ అనే సినిమాని రూపొందిస్తున్నాము. కొత్త ద‌ర్శ‌కుడు విష్ణు ద‌ర్శ‌త్వంలో మ‌ళ‌యాళంలో రూపొందుతున్న నైనాలో 96 మూవీ ఫేమ్ గౌరి కిషన్ లీడ్ రోల్ చేస్తుంది. మూవీ షూటింగ్ పూర్త‌యింది. బాలీవుడ్ పాపుల‌ర్ రైట‌ర్స్ సిద్దార్ధ , గ‌రీమ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందున్న దుకాన్ మూవీ షూటింగ్ ఆఖ‌రి షెడ్యూల్‌ల‌లో ఉంది. 2022 సంవ‌త్స‌రం య‌స్ ఓరిజ‌న‌ల్స్‌కి చాలా ప్ర‌త్యేకంగా ఉండ‌బోతుంది. మా సంస్థ‌ నుంచి 9 సినిమాలు రిలీజ్ అవుతాయి. కొత్త కాన్సెప్ట్ ల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాయ‌నే న‌మ్మ‌కం బ‌లంగా ఉంది. కొత్త టాలెంట్ ని ప్రోత్స‌హించ‌డంలో య‌స్ ఓరిజిన‌ల్స్ సంస్థ ఎప్పుడూ ముందు ఉంటుంది. అన్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు