Hero Nani - Actress Jhansi: స్టేజిపైనే యాంకర్ ఝాన్సీకీ జలక్ ఇచ్చిన నాని.. అసలేం జరిగిందంటే?

Hero Nani - Actress Jhansi

Hero Nani - Actress Jhansi:  టాలీవుడ్ నాచురల్ స్టార్ హీరో నాని. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని మంచి అభిమానాన్ని అందుకున్నాడు. ఇప్పటికీ వరుస సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.

  • Share this:
    Hero Nani - Actress Jhansi:  టాలీవుడ్ నాచురల్ స్టార్ హీరో నాని. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని మంచి అభిమానాన్ని అందుకున్నాడు. ఇప్పటికీ వరుస సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు. అష్ట చమ్మ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి తొలిసారిగా పరిచయం అయిన నాని.. అంతకంటే ముందు దర్శకుడిగా ఇండస్ట్రీకీ పరిచయం కావాలనుకున్నాడు. కానీ క్లాప్ అసిస్టెంట్ గా తన కెరీర్ ప్రారంభించాడు. ఇదిలా ఉంటే యాంకర్ ఝాన్సీ ఓ జలక్ ఇచ్చాడు.

    వరుస సినిమాలలో అవకాశాలు అందుకుని మంచి సక్సెస్ అందుకుంటున్నాడు. కథ ఎంచుకునే విధానంలో నానికి మంచి గుర్తింపు ఉంది. ఇక ప్రస్తుతం 'శ్యామ్ సింగరాయ్' సినిమాలో నటించగా ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది.ఇక 'టక్ జగదీష్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే 'అంటే సుందరానికి' సినిమాను మొదలు పెట్టనున్నాడు నాని.

    ఇక సత్యదేవ్ నటించిన 'తిమ్మరుసు' సినిమా ఈరోజు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా అందులో నాని గెస్ట్ గా వచ్చాడు. ఇక కొన్ని విషయాలు పంచుకున్నాడు నాని. బార్లు, పబ్ లు ఓపెన్ చేసిన థియేటర్స్ మాత్రం ఓపెన్ కాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక యాంకర్ ఝాన్సీ ఈ సినిమాలో నటించగా ఆమెకు వేదికపైనే జలక్ ఇచ్చాడు నాని.

    Hero Nani - Actress Jhansi
    Hero Nani - Actress Jhansi


    ఝాన్సీ అంటే తన ఫ్యామిలీ అని.. తను యాక్టర్ కాకముందు ఝాన్సీ దగ్గరికి వెళ్లి కలిశాడట. అప్పటికి తన కెరీర్ స్టార్ట్ కాకపోవడంతో సినిమాలలో ఏదో ఒకటి చేయడానికి తనను కలిశాడట. దాంతో ఝాన్సీ నీకు సినిమాలు ఎందుకు అని అనడంతో.. ఇప్పుడు ఝాన్సీని ఎక్కడ కలిసిన తన గురించి తను గర్వంగా ఫీల్ అవుతున్నాను అని వేదికపైన ఓ చిన్న జలక్ ఇచ్చాడు. దీంతో వెంటనే ఝాన్సీ షాక్ అయినట్టు ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. అంటే ఈ మాటతో తనను పొగిడాడా లేక తిట్టాడో అర్థం కానట్టు ముఖం పెట్టింది  ఝాన్సీకి.
    Published by:Navya Reddy
    First published: