హోమ్ /వార్తలు /సినిమా /

No. 1 Yaari: ఇలాంటివి అడుగుతారని తెలిస్తే వచ్చేవాణ్ని కాదు: నాని

No. 1 Yaari: ఇలాంటివి అడుగుతారని తెలిస్తే వచ్చేవాణ్ని కాదు: నాని

No. 1 Yaari

No. 1 Yaari

No. 1 Yaari: రానా దగ్గుబాటి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న షో నెంబర్ వన్ యారీ. ఆహా యాప్ లోను జెమినీ టీవిలో ప్రసారం అయ్యే ఈ షో ఎంతో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది.

No. 1 Yaari: రానా దగ్గుబాటి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న షో నెంబర్ వన్ యారీ. ఆహా యాప్ లోను జెమినీ టీవిలో ప్రసారం అయ్యే ఈ షో ఎంతో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే నెంబర్ 1 యారి షో కు ప్రతి ఒక సినిమా గెస్ట్ లు వస్తుంటారు. అలానే ఈ వారం టక్ జగదీశ్ టీం అంటే హీరో నాని, రీతూ వర్మ వచ్చి సందడి చేశారు.

ఇక రానా దగ్గుబాటి గురించి తెలిసిందే. అవకాశం వచ్చిందంటే చాలు ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించి వారి నుంచి సమాదానాలు రప్పిస్తుంటాడు. ఇక ఈ ఎపిసోడ్ లోను అంతే.. 'స్క్వర్‌ రూట్‌ ఆఫ్‌ 36 ఎంత' అని రానా అడగానే మా ఆఫీసు లైనే అదే అంటూ కామెడీ చేస్తాడు. అంతే కాదు నాని అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేసిన తొలి సినిమా ఏది అని రీతూని అడగ్గా ఆమె సమాధానం తెలియక అయ్యో అంటూ కామెడీ ఎక్సప్రెషన్స్ పెడుతుంది.

https://youtu.be/6Kyikr7Z4cE

అసలు ఇది ఎందుకుందిరా అనిపించిన బాడీ పార్ట్‌ ఏంటి అని రానా ప్రశ్నించగా.. ఇలాంటివి అడుగుతారని తెలిస్తే వచ్చేవాణ్ని కాదు అంటూ నవ్వడం ఈ ప్రోమోలో హైలెట్ గా నిలిచింది. ఈ ప్రోమోకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ఈ ఆదివారం రాత్రి ఆహా యాప్ లో విడుదల కానుంది. కాగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన టాక్ జగదీశ్ వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా వాయిదా పడింది. కరోనా కేసులు ఎక్కువ అవ్వడం వల్లనే ఈ సినిమా వాయిదా పడింది. అయినప్పటికీ ఈ సినిమాకు సంబంధించి ప్రేమోషన్స్ ఇప్పటికే పూర్తికావడంతో మొన్న ఉగాదికి ఈటీవి జాతిరత్నాలు షో లో, ఇప్పుడు నెంబర్ 1 యారి షోస్ ప్రసారం అవుతున్నాయ్.

First published:

Tags: Nani, No. 1 Yaari, Rana daggubati, Ritu varma, Shiva Nirvana

ఉత్తమ కథలు