హోమ్ /వార్తలు /సినిమా /

Music Director Eshwar Rao : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇంకో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు ఈశ్వర రావు మృతి..

Music Director Eshwar Rao : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇంకో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు ఈశ్వర రావు మృతి..

Music Director Eshwar Rao Passes Away : 2022 కూడా చిత్ర పరిశ్రమకు కలిసి రాలేదు. ఈ రెండున్నర నెలల  వ్యవధిలో పలువురు ప్రముఖులు ఈ లోకాన్ని విడిచి  వెళ్లారు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పీ ఈశ్వర్ రావు అనారోగ్యంతో కన్నుమూసారు.

  Music Director Eshwar Rao Passes Away : 2022 కూడా చిత్ర పరిశ్రమకు కలిసి రాలేదు. ఈ రెండున్నర నెలల  వ్యవధిలో పలువురు ప్రముఖులు ఈ లోకాన్ని విడిచి  వెళ్లారు. ముఖ్యంగా సంగీత సాహిత్యాలకు సంబంధించిన ప్రముఖులు ఒక్కొక్కరుగా ఈ లోకాన్ని విడిచి వెళుతున్నారు. ఈ రోజే ప్రముఖ సినీ పాటల రచయత  కందికొండ యాదగిరి మృతి చెంది కొన్ని గంటలు గడవక ముందే  ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పీ ఈశ్వర్ రావు అనారోగ్యంతో చికిత్స తీసుకుంటూ చెన్నైలో తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 63 యేళ్లు. గత కొన్నేళ్లుగా ఈయన ఆరోగ్యం ఏమంత బాగాలేదు. ఈయన ఒకప్పటి ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి కుమారుడు. ఈయననే ప్రముఖ లెజండరీ గాయకుడు, నిర్మాత, సంగీత దర్శకుడు గాన గంధర్వుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

  ఈశ్వరరావు తెలుగుతో పాటు తమిళంలో పలు సినిమాలకు టీవీ సీరియల్స్‌కు సంగీతం అందించారు. ఈయన ఎక్కువగా ఎస్పీ కృష్ణారెడ్డి సహా పలువురు సంగీత దర్శకులు ఈయన అసిస్టెంట్‌గా పనిచేశారు. ఈటీవీలో ప్రసారమయ్యే సీరియల్స్’కు ఈయన ఎక్కువ మ్యూజిక్ కంపోజ్ అందించారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈయన మరణంపై సినీ ప్రముఖులు విషాదం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించారు.

  Radhe Shyam : 2022లో ప్రభాస్ ’రాధే శ్యామ్’ మరో రికార్డు.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రెబల్ స్టార్ దూకుడు..

  మరోవైపు 2022లో  భారతరత్న లతా మంగేష్కర్ ఈ లోకాన్ని విడిచివెళ్లారు. మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ తనయుడు.. మహేష్ బాబు అన్న రమేష్ బాబు కూడా అకాల మరణం చెందారు. ఆ తర్వాత తన సంగీతంతో ప్రేక్షకులను ఊర్రూతలూగించిన బప్పీలహరి కూడా కన్నుమూయడం సినీ సంగీతాభిమానులను తీవ్ర కలతకు గురి చేసింది. మరోవైపు టాలీవుడ్ సినీ సంగీతంలో తన పాటలతో మైమరిపించిన కందికొండ గత కొంత కాలంగా కాన్సర్‌తో బాధపడుతూ.. కాసేటి క్రితమే కన్నుమూసిన సంగతి తెలిసిందే కదా.

  First published:

  Tags: Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు