TOLLYWOOD MOVIE WORKERS GOING TO STRIKE FOR INCREASE DAILY WAGES AND GIVEN NOTICE TO CINE CHAMBER TA
Tollywood Cine Idustry Strike : టాలీవుడ్ సినీ కార్మికుల సంచలనం.. వేతనాలు పెంచాలంటూ సమ్మె నోటీసు..
సినీ కార్మికుల సమ్మె (File/Photo)
Tollywood Cine Idustry : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సమ్మెకు సైరన్ మోగింది. ప్రస్తుతం ఇంటా బయటా అన్నింటా ధరలు ఆకాశాన్ని అంటాయి. ధరల పెరుగుదలతో నిత్యావసరాల ధరలు మండుతున్నాయి. ఈ నేపథ్యంలో సినీ కార్మికులు సమ్మెకు పిలుపు నివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Tollywood Cine Idustry : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సినీ కార్మికులు వేతనాలు పెంచాలంటూ సమ్మెకు నోటీసులు ఇచ్చారు. గత రెండేళ్లుగా సినీ ఇండస్ట్రీ కోవిడ్ కారణంగా పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఇపుడిపుడే ఇండస్ట్రీ కోలుకుంటోంది. మరోవైపు సినిమాల్లో హీరోలకు కోట్లకు కోట్లకు ఇచ్చే నిర్మాతలు .. అందులో పనిచేసే 24 క్రాఫ్ట్ మెంబర్స్‌కు తగివ వేతనాన్ని ఇవ్వడం లేదు. గత కొన్నేళ్లుగా సినీ కార్మికుల వేతనాల్లో ఎలాంటి మార్పులు లేవు. ప్రస్తుతం ఇంటా బయటా అన్నింటా ధరలు ఆకాశాన్ని అంటాయి. ధరల పెరుగుదలతో నిత్యావసరాల ధరలు మండుతున్నాయి. దానికి తగ్గట్టు జీతాలు మాత్రం పెరగడం లేదు. దీంతో గత కొన్నేళ్లుగా సినీ కార్మికులు వేతనాలు పెంచమంటూ నిర్మాతల మండలిపై ఒత్తిడి చేస్తూ వచ్చింది. ఇక ఫెడరేషన్ కూడా కార్మికుల వేతనాల అంశాన్ని సాగదీస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇన్ని రోజులు వేతనాలు పెంచకుండా ఉన్నందుకు రేపటి (22 జూన్) నుంచి సమ్మె చేయనున్నట్టు సినీ ఇండస్ట్రీలోని 24 కీలక విభాగాల వాళ్లు ప్రకటించారు.
అంతేకాదు జీతాలు పెంచేవరకు సినీ ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్ వారు షూటింగ్‌కు రాకూడదని ఫెడరేషన్ మీద ఒత్తిడి చేయడానికీ 24 యూనియన్ సభ్యులు ఈ బుధవారం ఉదయం ఫిల్మ్ ఫెడరేషన్ ముట్టడి చేయన్నట్టు ప్రకటించారు. ఇక వేతానాలు పెంచే వరకు 24 క్రాఫ్ట్స్ ఎవరు షూటింగ్లో పాల్గొనబోమని ఈ సందర్భంగా ప్రకటించారు. మరి కార్మికుల వేతనాలపై ఫిల్మ్ ఫెడరేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి కార్మికుల అత్యవసర సమ్మె నోటీసులు కారణంగా చిరంజీవి రంగంలోకి సమస్యను పరిష్కరిస్తారా లేదా అనేది చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.