నటీనటులు: విజయ్ కృష్ణ, యోగిషా సుకన్య, తేజు, నాగ మహేష్ తదితరులు
ఎడిటింగ్: నందమూరి హరి
డిఓపి: సన్నీ
మ్యూజిక్: చిన్ని కృష్ణ
నిర్మాత: సాయి కిషన్ రెడ్డి
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: విజయ్ కృష్ణ
విజయ్ కృష్ణ హీరోగా నటించిన గణా సినిమా మార్చి 17న విడుదలైంది. నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా ఈ సినిమాతో మెప్పించే ప్రయత్నం చేశాడు విజయ్ కృష్ణ. మరి గణా సినిమా ఎలా ఉంది.. కథ కథనాలు ఏంటి.. అనేది డీటెయిల్డ్ రివ్యూలో చూద్దాం..
కథ:
వైజాగ్ లో డ్రగ్స్ దందా ఎక్కువగా నడుస్తుంటుంది దానికి కేంద్రం వైజాగ్ పోర్ట్ ఏరియా ఈ మొత్తం బిజినెస్ మినిస్టర్ కోటేశ్వరరావు చేతుల్లో ఉంటుంది ఈ మొత్తం దందాను గణా (విజయ్ కృష్ణ) ఒక్కడే ఏకచత్రాధిపత్యంతో ఏలేస్తుంటాడు. ఈ క్రమంలోనే మినిస్టర్‌కు అడ్డు వస్తున్నాడని వోడ్కా దాస్ (నాగ మహేష్)ను అతి దారుణంగా గణా చంపేస్తాడు. దీంతో అతని తమ్ముడు దాము, ఎక్స్ ఎమ్మెల్యే అంతా కలిసి గణాను కట్టడి చేయాలని చూస్తారు. ఇదిలా నడుస్తుండగానే డాక్టర్ సౌమ్య (యోగిష)తో ప్రేమలో పడతాడు గణ. యోగిష తండ్రి పోలీస్ ఆఫీసర్‌ని చంపే కాంట్రాక్ట్ గణాకు వస్తుంది. ఈ నేపథ్యంలోనే గణా చేయని నేరానికి సౌమ్య అపార్థం చేసుకుంటుంది. అసలు గణా ఇలా ఎందుకు మారిపోయాడు.. గతంలో ఏం జరిగింది ? ఆయన జీవితంలో ఉన్న ప్రియ (తేజు) ఎవరు? ఆమెను ఎవరు ఎందుకు హత్య చేశారు? అనేది మిగిలిన కథ..
కథనం:
డ్రగ్స్ మాఫియా చుట్టూ ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో కథలు వచ్చాయి. ఇప్పుడు విడుదలైన గణా సినిమా కూడా ఎక్కువగా డ్రగ్స్, ఇల్లీగల్ బిజినెస్ చుట్టూనే తిప్పాడు దర్శకుడు కం హీరో విజయ్ కృష్ణ. డ్రగ్స్ దందాతో ముడి పెట్టుకుని వాటి చుట్టూ ఉన్న రాజకీయాలను ఇందులో ఎక్కువగా చూపించాడు. దాంతోపాటు డ్రగ్స్ బిజినెస్ పొలిటికల్ లీడర్స్ ఎలా చేస్తారో అనే విషయాన్ని కూడా ఇందులో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు విజయ్ కృష్ణ. దాంతోపాటు వైజాగ్ పోర్ట్ నమ్ముకుని ఎన్ని వేలమంది బతుకుతున్నారు.. వాళ్ళ జీవనశైలి ఏంటి అనేది కూడా చూపించారు. ఈ సినిమా కథ అంతా సముద్ర తీరం చుట్టూ తిరుగుతుంది కాబట్టి వైజాగ్, కాకినాడ , యానం చుట్టు పక్కల చిత్రీకరించిన సన్ని వేశాలు ఎంతో సహజంగా అనిపిస్తాయి.
సినిమాలో హీరో గణా క్యారెక్టరైజేషన్ బాగుంది. అసలు ఆయన అసలు రౌడీనా? హీరోనా? అనే ప్రశ్న ఫస్ట్ ఆఫ్ మొత్తం కలుగుతుంది. ఆసక్తికరమైన ట్విస్ట్ తో ఇంటర్వెల్ సీన్ కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది. ఇక కీలకమైన సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ జస్ట్ ఓకే అనిపించింది. సెకండ్ హాఫ్ లో కథ కంటే ఎక్కువగా ఎలివేషన్స్ ఉండేలా చూసుకున్నాడు దర్శకుడు. కాకపోతే ఇలాంటి సన్నివేశాలు ఇప్పటికే ఎన్నో చూడడంతో పెద్దగా ఆసక్తి అనిపించదు. తెలిసిన కథ కావడంతో కథనంలో ఇంకాస్త వేగం ఉండుంటే గణ మంచి సబ్జెక్ట్ అయ్యేది. పైగా పూర్తిగా కొత్త వాళ్ళతో చేసిన సినిమా కావడంతో యావరేజ్ అటెంప్ట్ గా మిగిలిపోయింది ఈ సినిమా.
నటీనటులు:
గణా పాత్రలో విజయ్ కృష్ణ బాగానే ఉన్నాడు. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ కూడా బాగుంది. యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌లో మెప్పించాడు. నటించడం మాత్రమే కాకుండా దర్శకత్వ బాధ్యత కూడా తీసుకోవడం మంచి విషయమే. హీరోయిన్లుగా కనిపించిన యోగిష, తేజులు బాగానే ఉన్నారు. నటనతో పాటు గ్లామర్ షో కూడా చేశారు. సీనియర్ నటుడు మహేష్, దాము పాత్రలు ఆకట్టుకుంటాయి. ప్రభు చేసిన పోలీస్ పాత్ర కూడా అందరినీ మెప్పిస్తుంది. జబర్దస్త్ అప్పారావ్, దొరబాబుల కామెడీ కూడా ఓకే అనిపిస్తుంది.
టెక్నికల్ టీం:
ఇలాంటి డ్రగ్స్ మాఫియా సినిమాలకు మ్యూజిక్ కీలకం. ఇందులో పాటలు ఆకట్టుకోలేదు కానీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలు బాగా ఎలివేట్ చేశారు. తెరపై మాత్రం సినిమా చూస్తున్నంత సేపు కెమెరా మాటలు అక్కడకక్కడా పేలుతాయి. ఈ సినిమాకు అన్నింటికంటే కలిసి వచ్చే విషయం రన్ టైమ్ తక్కువగా ఉండడం. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
చివరగా ఒక్కమాట:
గణా.. మాఫియా డ్రగ్స్ డ్రామా..
రేటింగ్: 2.5/5
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Movie reviews, Telugu Cinema, Tollywood