Home /News /movies /

1997 Movie review: నవీన్ చంద్ర ‘1997’ రివ్యూ.. అనగనగా ఓ రియల్ ఇన్సిడెంట్..

1997 Movie review: నవీన్ చంద్ర ‘1997’ రివ్యూ.. అనగనగా ఓ రియల్ ఇన్సిడెంట్..

నవీన్ చంద్ర 1997 సినిమా రివ్యూ (1997 movie review)

నవీన్ చంద్ర 1997 సినిమా రివ్యూ (1997 movie review)

1997 Movie review: ఈ మధ్య కాలంలో వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలు చాలానే వస్తున్నాయి. అలా ఇప్పుడు వచ్చిన సినిమా 1997. అందాల రాక్షసి ఫేమ్ నవీన్‌ చంద్ర, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, కోటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..

ఇంకా చదవండి ...
నటీనటులు : డా. మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి, బెనర్జీ, రవి ప్రకాష్, రామ రాజు తదితరులు…
ఎడిటింగ్ : నందమూరి హరి
సంగీతం : కోటి
కెమెరా : చిట్టి బాబు
నిర్మాత: మీనాక్షి రమావత్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: డాక్టర్ మోహన్

ఈ మధ్య కాలంలో వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలు చాలానే వస్తున్నాయి. అలా ఇప్పుడు వచ్చిన సినిమా 1997. పాఠశాల రోజుల్లో సెలవులకి ఊరికి వెళ్లినప్పుడు తన తాత చెప్పిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమాను చేసాడు ఈయన. అందాల రాక్షసి ఫేమ్ నవీన్‌ చంద్ర, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, కోటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..

కథ :
నిజాంపేట గ్రామంలో ఓ దొర హంగామా చేస్తుంటాడు. పైగా అతను ఆ ఊరికి ఎంఎల్ఏ కూడా. అతన్ని కాదని ఆ ఊరిలో ఎవరు ఏం చేయలేరు. అతడి కనుసన్నల్లోనే అంతా నడుస్తుంటుంది. పోలీసులు కూడా దొరకు బాన్ చంద్ అంటుంటారు. ఈ నేపథ్యంలో గంగ అనే అమ్మాయి ఘోరంగా అత్యాచారానికి గురవ్వడంతో పాటు చనిపోతుంది. ఈత రాక నీళ్లలో మునిగి చనిపోయిందని చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. కానీ అదే గ్రామానికి ఏఎస్ఐగా వచ్చిన విక్రమ్ రాధోడ్ ( డా. మోహన్ ) నిజానిజాలు తెలుసుకుని అసలైన దోషులను శిక్షించే ప్రయత్నం చేస్తాడు. ఈ నేపథ్యంలోనే దొర (రామరాజు) కు అండగా నిలబడుతూ అతడు చేసే అన్ని అన్యాయాలను కప్పిపుచ్చే సిఐ చారి ( శ్రీకాంత్ అయ్యంగార్ ) కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తాడు. న్యాయం అన్నది తక్కువ కులం, ఎక్కువ కులం అని కాకుండా అందరికి సమానంగా ఉండాలన్న లక్ష్యంతో రంగంలోకి దిగి గంగను మానభంగం చేసి చంపిన దోషులను టార్గెట్ చేస్తాడు విక్రమ్ రాధోడ్. అప్పుడు అతడికి ఎదురైన పరిస్థితులే ఈ సినిమా కథ..

Tollywood actress remuneration: స్టార్ హీరోయిన్స్ పారితోషికంలో గండి పడుతుందా.. కరోనా ఎఫెక్ట్..?


కథనం:
సమాజంలో ఉన్న కులమతాల అసమానతల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఇది. మన దేశంలో ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో తక్కువ కులాలపై, ఆ కులాలలో ఉండే మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో వచ్చిన సినిమా 1997. ఒక దొర అహంకారానికి బలైన ఓ అమాయకురాలి కథ ఇది. పోలీస్ డ్రామాతో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేసాడు దర్భకుడు మోహన్. సమాజంలో అసమానతలకి అద్దం పట్టేలా తెరకెక్కించే ప్రయత్నం చేసాడు దర్శకుడు. నవీన్‌ చంద్ర అధికారి పాత్రలో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా శ్రీకాంత్‌ అయ్యంగార్‌... చారి అనే పోలీస్‌గా చాలా బాగా నటించారు. ఈయన చుట్టూ వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. అయితే ఈ తరహా కథతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. వాటితో పోలిస్తే ఇదేం భిన్నంగా లేకపోవడం మైనస్. కాకపోతే సినిమాను రియలిస్టిక్‌గా తీసే ప్రయత్నం చేయడం ప్రశంసనీయం. సంగీత దర్శకుడు కోటి ఓ పాత్రతో పాటు ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. ఆయన నటన కూడా బాగుంది. డా. మోహన్ హీరోగా, దర్శకుడిగా రెండు పాత్రల్లో చక్కగా చేసాడు. హీరోగా ఆకట్టుకున్నాడు. ఇక దర్శకుడిగా సినిమాను అద్భుతంగా తెరకెక్కించే ప్రయత్నం చేసాడు. నేటి సమాజంలో జరుగుతున్న సమస్యల నేపథ్యంలో ఎన్ని చిత్రాలు వచ్చినా కూడా ప్రజలు మారతారని చేసే ప్రయత్నాలే. నిజంగా అలాంటి సినిమాలు చూసి జనాలు మారతారా..? అన్నది ఇప్పటికి ప్రశ్నే.

Nayanthara marriage: నయనతారకు నిజంగానే పెళ్లి గండం ఉందా.. అందుకే మూడు ముళ్లకు దూరం..?


నటీనటులు:
ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. శ్రీకాంత్ అయ్యంగార్ పోషించిన చారి పాత్ర గురించి. సిఐ చారి పాత్రలో నెగిటివ్ షేడ్‌లో అదరగొట్టాడు. ఇప్పటి వరకు ఆయన కెరీర్‌లో ఇలాంటి పాత్ర అయితే చేయలేదు. హీరో విక్రమ్ రాధోడ్ పాత్రలో డా. మోహన్ బాగున్నాడు. ఏఎస్ఐగా అయన పరిధిలో చక్కగా నటించాడు. ఎంక్వయిరీ అధికారిగా అందాల రాక్షసి హీరో నవీన్ చంద్ర పాత్ర ఉన్నది కాసేపే అయినప్పటికీ ఆకట్టుకున్నాడు. పోలీస్ అధికారిగా న్యాయం పక్కన నిలబడాలని చేసే ప్రయత్నం బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ కోటి డిజిపిగా బాగా చేసాడు. అలాగే దొర పాత్రలో రామరాజు నటన బాగుంది. అలాగే దొర కొడుకు రాంబాబు పాత్ర కూడా పర్లేదు.

Hyper Aadi - Raising Raju: హైపర్ ఆది ఎలాంటి వాడో తెలుసా.. ఆ నిజాలు చెప్తూ గుక్కపెట్టి ఏడ్చిన రైజింగ్ రాజు..


టెక్నికల్ టీమ్:
సీనియర్ సంగీత దర్శకుడు కోటి మ్యూజిక్ బాగానే ఉంది. బ్యాగ్రౌండ్ స్కోర్ పర్లేదు. పాటలు అంతగా ఆకట్టుకోలేదు. చిట్టిబాబు అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త నీట్‌గా ఉండాల్సింది. సీనియర్ ఎడిటర్ నందమూరి హరి తన వరకు ప్రయత్నం బాగానే చేసాడు. దర్శకుడు , హీరో మోహన్ గురించి చెప్పాలంటే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అంటరానితనం ఇష్యూను చూపించాడు. నేటి సమాజంలో ఉన్న కులమతాల అసమానతలు , మహిళలపై జరుగుతున్నా దారుణాల నేపథ్యంలో ఈ కథను ఎంచుకున్నాడు దర్శకుడు. ఆలోచింప చేసే కథ, కథనంతో చక్కటి ప్రయత్నం చేసాడు. ఇక నిర్మాణ విలువలు పర్లేదు.

చివరగా ఒక్కమాట:
1997.. రియలిస్టిక్ అప్రోచ్..

రేటింగ్: 2.75/5
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Movie reviews, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు