Home /News /movies /

TOLLYWOOD MOVIE REVIEWS BHAGAT SINGH NAGAR REVIEW AND RATING PK

Bhagat Singh Nagar review: భగత్ సింగ్ నగర్.. చిన్న సినిమానే కానీ మంచి ప్రయత్నం..

భగత్ సింగ్ నగర్ రివ్యూ (bhagat singh nagar movie)

భగత్ సింగ్ నగర్ రివ్యూ (bhagat singh nagar movie)

Bhagat Singh Nagar review: ఈ రోజుల్లో చిన్న సినిమాలు అంటే కేవలం బూతు అని మాత్రమే చాలా మంది అనుకుంటున్నారు. కానీ మంచి సందేశంతో సినిమాలు చేయొచ్చని కొందరు నిరూపిస్తున్నారు. తాజాగా అలాంటి ప్రయత్నంతో వచ్చిన సినిమా భగత్ సింగ్ నగర్ (Bhagat Singh Nagar review).

ఇంకా చదవండి ...
నటీనటులు: విదార్థ్, ధృవీక, బెనర్జీ, రవి ప్రకాష్, మునిచంద్ర, అజయ్ గోష్, ప్రభావతి తదితరులు
సంగీతం - ప్రభాకర్ దమ్ముగారి
సినిమాటోగ్రఫీ - రాజేష్ పీటర్, కళ్యాణ్ సమి
ఎడిటింగ్ - జియాన్ శ్రీకాంత్
నిర్మాతలు - వాలాజ గౌరి, రమేష్ ఉడత్తు
రచన దర్శకత్వం - వాలాజ క్రాంతి

ఈ రోజుల్లో చిన్న సినిమాలు అంటే కేవలం బూతు అని మాత్రమే చాలా మంది అనుకుంటున్నారు. కానీ మంచి సందేశంతో సినిమాలు చేయొచ్చని కొందరు నిరూపిస్తున్నారు. తాజాగా అలాంటి ప్రయత్నంతో వచ్చిన సినిమా భగత్ సింగ్ నగర్. ఆలోచింపజేసేలా సాగిన భగత్ సింగ్ నగర్ సినిమా ఎలా ఉందో చూద్దాం..

కథ:
భగత్ సింగ్ నగర్ అనే మురికివాలో స్నేహితులతో కలిసి సరదాగా తిరిగే కుర్రాడు శ్రీను ( విదార్థ్). ఈ గ్యాంగ్‌లో చంద్రయ్య (ముని చంద్ర) అనే తాత ఉంటాడు. అతని ఇంట్లో పెరిగే అమ్మాయి లక్ష్మి (దృవీక)ని శ్రీను ప్రేమిస్తుంటాడు. చంద్రయ్యతో సహా స్నేహితులతో కలిసి శ్రీను పనిచేస్తూ.. సాయంత్రం అయితే మద్యం తాగుతుంటాడు. భగత్ సింగ్ నగర్ లో మద్యపానానికి అలవాటై కుటుంబాలు పాడు చేసుకుంటున్న కొందరిని చూసి శ్రీను మందు మానేస్తాడు. ఎక్కడైనా గొడవలు జరిగితే ఆపేందుకు ప్రయత్నిస్తాడు. ఇదే సమయంలో బస్తీలో కొందరు అమ్మాయిలు అపహరణకు గురవుతుంటారు. ఇలా కిడ్నాప్ అయిన అమ్మాయిలు ఏమవుతున్నారో చంద్రయ్య తెలుసుకుంటాడు. కానీ ఈ విషయం ఎవరకి చెప్పడు. శ్రీను, లక్ష్మిల పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకుని పెళ్లి జరిగే సమయానికి లక్ష్మిపై కొందరు అత్యాచారం చేస్తారు. అడ్డుకున్న శ్రీనును కూడా చంపేస్తారు. పోలీసులు నేరస్తులతో కుమ్మక్కై మూసేసిన ఈ కేసుపై డాక్యుమెంటరీలు తీసుకునే యువకుడు భగత్ పోరాటం మొదలు పెడతాడు. అమాయకులపై జరిగిన ఘోరాలకు ఎమ్మెల్యే వైసీ రావు (అజయ్ ఘోష్) ఉన్న సంబంధం ఏంటి.. ఈ గ్యాంగ్‌పై భగత్ (విదార్థ్) చేసిన న్యాయ పోరాటం పలించిందా లేదా అనేది కథ.

Puneeth Rajkumar biopic: పునీత్ రాజ్‌కుమార్ బయోపిక్‌కు రంగం సిద్ధం.. దర్శకుడు ఎవరంటే..?


కథనం:
భగత్ సింగ్ నగర్.. టైటిల్‌తోనే సినిమా ఎలా ఉంటుందో క్లారిటీ ఇచ్చేసాడు. సమాజం కోసం చేసిన కథ ఇది అంటూ ముందు నుంచి దర్శక నిర్మాతలు చెప్తున్నారు. అన్నట్లుగానే కథ కూడా అలాంటిదే రాసుకున్నారు. ఉన్నంతలో సినిమాను బాగా చేయడానికి తమ వంతు కృషి చేసారు. సినిమా పోస్టర్స్, టైటిల్స్‌లోనే దేశ భక్తుల ఫొటోలు, అన్యాయాలపై పోరాటం చేసిన ధీరుల చిత్రాలను చూపించారు. తప్పు జరిగితే తిరగబడాలనే స్ఫూర్తిని సినిమా ఆరంభం నుంచే కలిగించారు దర్శకుడు వాలాజ క్రాంతి. అదే సినిమాలోనూ చూపించాడు ఈయన. సమాజం మారాలంటే ఎవరో ఒకరు ముందడుగు వేయాలనే ఆలోచనతో ఈ సినిమా చేసారు. ఇదే ఆలోచనను బలంగా చూపించే ప్రయత్నం కూడా చేసారు. అయితే చిన్న బడ్జెట్ కావడం.. స్టార్ కాస్ట్ లేకపోవడం ఈ సినిమాకు మైనస్. తన వాడలో ఎవరు మహిళలను కించపరిచినా వాళ్లకు తగిన బుద్ధి చెప్పే విధంగా హీరో పాత్రను చూపించారు.. అలాగే మందు వల్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయని వెంటనే మందు మానేస్తాడు. హీరోయిజంతో సినిమా సాగుతూనే, శ్రీను లక్ష్మిల మధ్య లవ్ స్టోరీ కూడా చూపించాడు దర్శకుడు క్రాంతి. కథ రొటీన్‌గానే అనిపించినా స్క్రీన్ ప్లే బాగానే అనిపిస్తుంది. ముందుగా చెప్పినట్లు స్టార్ క్యాస్ట్ లేకపోవడమే భగత్ సింగ్ నగర్‌కు మైనస్.

బొమ్మ ఫట్.. కారెక్టర్ హిట్.. ఫ్లాప్ సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేసిన నటులు వీళ్ళే..


నటీనటులు:
నటీనటుల్లో శ్రీను, భగత్ రెండు క్యారెక్టర్స్‌లో వేటికవే భిన్నంగా పోషించాడు హీరో విదార్థ్. క్లాస్ మాస్ కారెక్టర్స్‌లో బాగానే కనిపించాడు. స్లమ్ బాయ్ శ్రీనుగా సహజంగా కనిపించిన విదార్థ్.. డాక్యుమెంటరీ మేకర్‌గానూ ఆకట్టుకున్నాడు. లక్ష్మి, అనన్య పాత్రల్లో దృవీక కూడా అటు సంప్రదాయంగా, ఇటు మోడరన్‌గా మెప్పించింది. ఎమ్మెల్యే సీవీఆర్ క్యారెక్టర్‌లో రాజకీయ నాయకుడిగా నేచురల్ పర్మార్మెన్స్ చేశాడు అజయ్ ఘోష్. అతనికి ఇలాంటి క్యారెక్టర్లు కొట్టిన పిండి. కథలో ట్విస్ట్ ఉన్న క్యారెక్టర్ చేసి షాక్ ఇచ్చాడు రవి కాలె. బెనర్జీ చేసిన ఎస్ఐ క్యారెక్టర్ బాగుంది. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నికల్ టీమ్:
సినిమాటోగ్రఫీ, సంగీతం, ఎడిటింగ్ లాంటి విభాగాల్లో భగత్ సింగ్ నగర్ సినిమా క్వాలిటీ బాగానే ఉంది. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లోనూ మంచి ప్రయత్నమే చేసారు. గ్రేట్ ఇండియా మీడియా హౌస్ మేకింగ్ వ్యాల్యూస్ కథకు తగినట్లు ఉన్నాయి. ఫస్టాఫ్, సెకండాఫ్‌లో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే పాటలతో పాటు ‘చరిత చూపని’ సాంగ్ బాగుంది. ఇలాంటి మంచి సందేశాత్మక సినిమా చేసిన నిర్మాతలు వాలాజా గౌరి, రమేష్ ఉడత్తులను మెచ్చుకోవాలి. దర్శకుడు వాలాజ క్రాంతికి భగత్ సింగ్ నగర్ సినిమాతో ప్రశంసలు వచ్చే అవకాశం ఉంది.

చివరగా ఒక్కమాట:
భగత్ సింగ్ నగర్.. చిన్న సినిమానే కానీ మంచి ప్రయత్నం..

రేటింగ్ 2.75/5
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Movie reviews, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు