హోమ్ /వార్తలు /సినిమా /

Balamevvadu movie review: 'బలమెవ్వడు' మూవీ రివ్యూ.. మెడికల్ మాఫియాపై ప్రయోగం..

Balamevvadu movie review: 'బలమెవ్వడు' మూవీ రివ్యూ.. మెడికల్ మాఫియాపై ప్రయోగం..

బలమెవ్వడు సినిమా రివ్యూ (balamevvadu review)

బలమెవ్వడు సినిమా రివ్యూ (balamevvadu review)

Balamevvadu movie review: ఈ మధ్య విభిన్నమైన కాన్సెప్టులతో చాలా సినిమాలు వచ్చాయి. అందులో చిన్న సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. తాజాగా మరోసారి ఇలాంటి చిత్రమే వచ్చింది. అదే బలమెవ్వడు.. ప్రమోషన్స్ నుంచే వినూత్నంగా చేస్తూ వచ్చిన ఈ సినిమా తాజాగా విడుదలైంది. మరి ఇది ఎలా ఉంది..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రివ్యూ: బలమెవ్వడు

నటీనటులు: ధృవన్ కటకం, నియా త్రిపాఠీ, పృద్విరాజ్, నాజర్, సుహాసిని మణిరత్నం, శ్రావణ్ భరత్ తదితరులు

బ్యానర్ : సనాతన దృశ్యాలు

నిర్మాత : ఆర్. బి. మార్కండేయలు

కథ, స్క్రీన్ ప్లే, మాటలు , దర్శకత్వం : సత్య రాచకొండ

సంగీతం : మణిశర్మ

సినిమాటోగ్రఫర్ : సంతోష్, గిరి

ఎడిటర్ : జస్విన్ ప్రభు

రిలీజ్ డేట్: 01/10/22

ఈ మధ్య విభిన్నమైన కాన్సెప్టులతో చాలా సినిమాలు వచ్చాయి. అందులో చిన్న సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. తాజాగా మరోసారి ఇలాంటి చిత్రమే వచ్చింది. అదే బలమెవ్వడు.. ప్రమోషన్స్ నుంచే వినూత్నంగా చేస్తూ వచ్చిన ఈ సినిమా తాజాగా విడుదలైంది. మరి ఇది ఎలా ఉంది..?

కథ:

సత్యనారాయణ (ధృవన్ కటకం) ఓ ఇన్సూరెన్స్ ఏజెంట్. తన పనిలో భాగంగా పాలసీ కోసం వెళ్లిన సత్య అక్కడ క్లాసికల్ డ్యాన్సర్ పరిణిక (నియా త్రిపాఠీ)ను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆ తర్వాత పరిణిక బైక్ రిపేర్ రావడంతో ఆ పక్కనే ఉన్న షెడ్‌కు వెళ్ళి సాయం చేయమని అడుగుతుంది. అయితే వాళ్లు హెల్ప్ చేయకపోగా రేప్ చేయడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు పరణికను సత్య కాపాడతాడు. ఆ పరిచయమే వాళ్ల మధ్య స్నేహంగా మారి ప్రేమగా మారిపోతుంది. ఆ తర్వాత చిన్న సమస్యతో హాస్పిటల్‌కు వెళ్లిన పరిణికకు బ్రెస్ట్ క్యాన్సర్ అని తేలుతుంది. దానికి కీమోథెరఫీ చెయ్యాలి అంటారు డాక్టర్ ఫణిభూషణ్ (పృథ్విరాజ్). ఆ తర్వాత ఏం జరిగింది అనేది అసలు కథ.

కథనం:

ఈ మధ్య కాలంలో మెడికల్ మాఫియాపై వచ్చిన సినిమాలు బాగానే సక్సెస్ అవుతున్నాయి. కొన్ని సినిమాల్లో అద్భుతమైన పాయింట్స్ కూడా చెప్తున్నారు. తాజాగా బలమెవ్వడు సినిమాలోనూ ఇదే చెప్పడానికి చూసాడు దర్శకుడు సత్య. ప్రస్తుతం సమాజంలో ఉన్న పరిస్థితులకు అద్దం పట్టేలాగే ఈ స్క్రిప్ట్ రాసుకున్నాడు ఈయన. ముఖ్యంగా మెడికల్ మాఫియాలో సరైన వైద్యం చేయకుండా ప్రజల ఆరోగ్యంతో బిజినెస్ చేస్తూ కోట్లు గడిస్తున్న వాళ్లను కూడా బాగానే చూపించాడు దర్శకుడు. ఇందులో పృథ్వీరాజ్ కారెక్టర్ పిబి అంతా అలాగే ఉంటుంది. ఈ రోజుల్లో ఏ చిన్న జబ్బు చేసినా ముందుగా హాస్పిటల్ వెళ్తాం.. కానీ అక్కడ ఓ కామన్ మ్యాన్‌ను మెడికల్ మాఫియా ఎంత దోచేస్తుందనేది ఈ చిత్రంలో చూపించాడు దర్శకుడు. ఈ కథను ఓ లవ్ స్టోరీతో ముడిపెట్టాడు. అందులోనే వినోదం కూడా సృష్టించాడు. కాకపోతే కొత్త నటీనటులతో తెరకెక్కించడం కారణంగా కాస్త వెనకబడిపోయింది ఈ సినిమా. దానికితోడు మెసేజ్ మరీ ఎక్కువైపోయినట్లు అనిపిస్తుంది. ఈ సందేశంలో వినోదం కాస్త మరుగున పడింది. స్క్రీన్ ప్లే ఇంకాస్త బాగుండుంటే కచ్చితంగా బలమెవ్వడు మంచి సినిమాగా మిగిలిపోయేది. హీరో హీరోయిన్ కొత్త వాళ్లే అయినా.. సుహాసిని, నాజర్ లాంటి సీనియర్ నటులు ఈ సినిమాకు బాగా హెల్ప్ అయ్యారు. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ ఆకట్టుకుంటుంది. మెడికల్ మాఫియా చుట్టు అల్లుకున్న సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

తీసుకున్న పాయింట్

సెకండాఫ్

సుహాసిని మణిరత్నం

మైనస్ పాయింట్స్:

ప్రమోషన్ లేకపోవడం

స్క్రీన్ ప్లే లోపాలు

కొన్ని సీన్స్

నటీనటులు:

ధృవన్ కటకం నటన బాగుంది. కొత్త వాడైనా స్క్రీన్ మీద బాగున్నాడు. పరిధి మేర నటించాడు. అలాగే నియా త్రిపాఠీ నటన కూడా బాగా ఆకట్టుకుంటుంది. పృథ్వీరాజ్ నటన సినిమాకు హైలైట్. యశోద పాత్రలో సుహాసిని అద్భుతమైన నటన కనబర్చారు. ఆమె డాక్టర్‌గా చాలా బాగా నటించారు. హాస్పిటల్ ఓనర్‌గా నాజర్ పాత్ర చిన్నదే అయినా కథలో కీలకం. మిగిలిన వాళ్లంతా తమ పాత్రల వరకు బాగానే మెప్పించారు.

టెక్నికల్ టీం:

మణిశర్మ సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పైగా ఆయన ఆర్ ఆర్ చాలా బాగుంది. సంతోష్, గిరి సినిమాటోగ్రఫీ వర్క్ ఆకట్టుకుంటుంది. చిన్న సినిమానే అయినా విజువల్స్ బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త ఫాస్ట్‌గా ఉండాల్సింది. దర్శకుడు సత్య రాచకొండ రాసుకున్న కథ చాలా బాగుంది. తీసుకున్న పాయింట్ ఆకట్టుకుంటుంది. అయితే దాన్ని తెరపై ఆవిష్కరించడంలో కాస్త తడబడినట్లు అనిపించింది. ఓవరాల్‌గా ఈయన మంచి ప్రయత్నమే చేసాడు.

పంచ్ లైన్:

బలమెవ్వడు.. చిన్న సినిమానే కానీ సందేశాత్మకం..

రేటింగ్: 2.75/5

Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Movie reviews, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు