TOLLYWOOD MOVIE PUSHPA NEW MASS POSTER RELEASED AND ALLU ARJUN RASHMIKA MANDANNA IN RUGGED LOOK PK
Pushpa new poster: ఏంది సామీ ఈ పోస్టర్.. అల్లు అర్జున్, రష్మిక మందన్న ఊర మాస్ అంతే..
పుష్ప నుంచి పోస్టర్ విడుదల (Pushpa movie poster)
Pushpa new poster: తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా మంది మాట్లాడుకుంటున్న సినిమా పుష్ప (Pushpa new poster). ఎందుకంటే అల వైకుంఠపురములో లాంటి స్టైలిష్ సినిమా తర్వాత బన్నీ (Allu Arjun) ఈ సినిమా కోసం మారిపోయిన తీరు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా మంది మాట్లాడుకుంటున్న సినిమా పుష్ప. ఎందుకంటే అల వైకుంఠపురములో లాంటి స్టైలిష్ సినిమా తర్వాత బన్నీ ఈ సినిమా కోసం మారిపోయిన తీరు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. సుకుమార్ పూర్తిగా అల్లు అర్జున్ లుక్‌ను మార్చేసాడు. ఇప్పుడు పుష్పలో అల్లు వారబ్బాయిని చూస్తుంటే వామ్మో అనుకుంటున్నారు అభిమానులు. అందుకే ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా పండగ చేసుకుంటున్నారు అభిమానులు. అందుకే మేకర్స్ కూడా ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించిన విశేషాలను అభిమానుల ముందుంచుతున్నారు. దానికి తోడు అల వైకుఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో పుష్పపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.
ఆర్య, ఆర్య 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా వస్తుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది. వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలతో పవర్ ప్యాక్డ్ ప్రొడక్షన్ హౌజ్‌గా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మరో నిర్మాణ సంస్ధ ముత్తంశెట్టి మీడియాతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, దాక్కో దాక్కో మేక, రష్మిక మందన శ్రీవల్లి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ సినిమా 'సామి సామి' అంటూ సాగే మూడో సింగిల్ కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. దీనికి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ఈ పాటలోని ఓ స్టిల్ బయటికి వచ్చింది. పక్కా మాస్ అవతారంలో అటు అల్లు అర్జున్.. ఇటు రష్మిక మందన్న కనిపిస్తున్నారు. న్యాచురల్ లుక్స్‌తో కట్టి పడేస్తున్నారు ఈ ఇద్దరూ. అక్టోబర్ 28, ఉదయం 11.07 నిమిషాలకు పూర్తి పాట విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్రహిత, మళయాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.