హోమ్ /వార్తలు /సినిమా /

Parai Movie Review: ‘పరారి’ మూవీ రివ్యూ.. కొత్త కుర్రాడొచ్చాడు..

Parai Movie Review: ‘పరారి’ మూవీ రివ్యూ.. కొత్త కుర్రాడొచ్చాడు..

పరారి తెలుగు సినిమా రివ్యూ (parari movie review)

పరారి తెలుగు సినిమా రివ్యూ (parari movie review)

Parai Movie Review: ఈ రోజుల్లో ప్రతీ వారం ఓ కొత్త హీరో ఇండస్ట్రీకి పరిచయం అవుతూనే ఉంటాడు. తాజాగా ఈ వారం మరో హీరో వచ్చాడు. అతడి పేరు యోగేశ్వర్. ఈ కుర్రాడు నటించిన సినిమా పరారి. మరి ఈ చిత్రం ఎలా ఉంది..? కొత్త దర్శకుడు సాయి శివాజీ అందర్నీ అలరించేలా పరారి రూపొందించాడా లేదా అనేది రివ్యూలో చూద్దాం..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మూవీ రివ్యూ: పరారి

నటీనటులు: యోగేశ్వర్, అతిథి, సుమన్, అలీ, మకరంద్ దేశ్ పాండే, షయాజీ షిండే తదితరులు

ఎడిటింగ్: కీ.శే. గౌతంరాజు

సంగీతం: మహిత్ నారాయణ్

సినిమాటోగ్రఫీ: గరుడవేగ అంజి

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: సాయి శివాజీ

నిర్మాణ సంస్థ: శ్రీ శంకర ఆర్ట్స్

ఈ రోజుల్లో ప్రతీ వారం ఓ కొత్త హీరో ఇండస్ట్రీకి పరిచయం అవుతూనే ఉంటాడు. తాజాగా ఈ వారం మరో హీరో వచ్చాడు. అతడి పేరు యోగేశ్వర్. ఈ కుర్రాడు నటించిన సినిమా పరారి. మరి ఈ చిత్రం ఎలా ఉంది..? కొత్త దర్శకుడు సాయి శివాజీ అందర్నీ అలరించేలా పరారి రూపొందించాడా లేదా అనేది రివ్యూలో చూద్దాం..

కథ:

యోగి (యోగీశ్వర్) ఓ స్టూడెంట్. అతడి కాలేజ్‌లోనే చదివే అతిథి (అతిథి)తో ప్రేమలో పడతాడు. హీరో తండ్రి (షయాజి షిండే) ఒక్క నిమిషం కూడా తీరికలేనంత బిజీగా ఉండే బిజినెస్ మ్యాన్. మన హీరోకి మరో ఇద్దరు స్నేహితులు(జబర్దస్త్ రఘు కారుమంచి, భూపాల్) ఉంటారు. అందులో భూపాల్‌.. ఆర్టిస్ట్ శివాని సైనిని ప్రేమిస్తుంటారు. లైఫ్ అంతా సవ్యంగా సాగుతుంది అనుకుంటున్న సమయంలో.. ఈ ఐదుగురు ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. దాన్నుంచి బయటపడటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు.. నానా ఇబ్బందులు పడుతుంటారు. అదే సమయంలో యోగీ తండ్రిని పాండే (మకరంద్ దేశముఖ్ పాండే) కిడ్నాప్ చేస్తాడు. అసలు యోగి ఆ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు..? తండ్రిని ఎలా కాపాడుకున్నాడు అనేది మిగిలిన కథ..

కథనం:

పరారి కొత్త కథేం కాదు.. ఎన్నో సినిమాల్లో చూసిన రొటీన్ కమర్షియల్ కథే. దాన్నే తన స్టైల్‌లో తీసాడు కొత్త దర్శకుడు సాయి శివాజీ. ఉన్నంతలో కమర్షియల్ హంగులు బాగానే అద్దాడు ఈయన. సినిమాను పూర్తిగా క్రైమ్ చుట్టూ తిప్పకుండా.. అక్కడక్కడా రొమాంటిక్ టచ్ కూడా ఇచ్చాడు. కాలేజ్ సన్నివేశాలను బాగానే రాసుకున్నాడు దర్శకుడు. అలాగే క్రైమ్ కామెడీ సీన్స్ కూడా బాగా అల్లుకున్నాడు. మంచి కామెడీని పండించాడు కూడా. కథ తెలిసిందే కావడంతో ఎక్కువగా కథనంపైనే ఫోకస్ చేసాడు దర్శకుడు. ఆ విషయంలో కొంతవరకు మెప్పించాడు కూడా. పరారి సినిమాలో దర్శకుడు సాయి శివాజీ ఎక్కువగా నమ్ముకున్న ఫార్ములా ఆయన పెట్టిన క్యాప్షన్‘రన్ ఫర్ ఫన్’నే. మూవీ నడుస్తున్నంత సేపు సస్పెన్స్‌తో పాటు కామెడీ కూడా ఉండేలా చూసుకున్నాడు. ఫస్టాఫ్ అంతా ఎక్కడా పెద్దగా రిస్కులు తీసుకోకుండా హాయిగా కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లోనే కథను నడిపించాడు. ప్రీ ఇంటర్వెల్‌ ముందు ఓ ట్విస్ట్ ఇచ్చి.. సెకండాఫ్‌కు లీడ్ ఇచ్చాడు. ఫస్టాఫ్‌లో అత్తాపురం ఎపిసోడ్‌తో కొంత అడల్ట్ కామెడీతో ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసాడు దర్శకుడు. సెకెండాఫ్ అంతా మర్డర్ మిస్టరీతోనే వెళ్లిపోయాడు సాయి శివాజీ. మెయిన్ ఆర్టిస్టుల నుంచి మంచి నటన రాబట్టుకున్నాడు. క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. మకరంద్ దేశ్ ముఖ్ పాండే అండ్ బ్యాచ్‌ను కథకు తగ్గట్లుగా బాగా వాడుకున్నాడు దర్శకుడు.

ప్లస్ పాయింట్స్:

హీరో నటన

సెకండాఫ్ క్రైమ్ కామెడీ

క్లైమాక్స్

నెగిటివ్ పాయింట్స్:

రొటీన్ కథ

ఫస్టాఫ్ కాలేజ్ సీన్స్

నటీనటులు:

హీరో యోగీశ్వర్ కొత్త కుర్రాడైనా స్క్రీన్ మీద లుక్ బాగుంది.. చూడ్డానికి బాగున్నాడు.. నటనలోనూ మెప్పించాడు. డాన్సులు బాగా చేసాడు. ఉన్నంతలో ఫైట్స్ కూడా బాగానే చేసాడు. మంచి కథ పడితే హీరోగా నిలబడే సత్తా ఉన్న కుర్రాడు. అలాగే డైలాగ్ డెలివరీ బాగుంది. హీరోయిన్ అతిథి పాత్ర జస్ట్ ఓకే అనిపిస్తుంది. హీరో ఫ్రెండ్స్ బాగున్నారు. చాలా రోజుల తర్వాత రఘు మంచి పాత్రలోనే కనిపించాడు. ఇక మరో కీలక పాత్రలో నటించిన శివానీ సైనీ ఓకే. సీనియర్ కమెడియన్ ఆలీ ఉన్నా.. ఓకే అనిపించాడంతే. మరో సీనియర్ నటుడు సుమన్ ఉన్నంతలో బాగా చేసాడు. సాయాజి షిండే ఓకే అనిపించాడు. హీరోయిన్ తల్లి పాత్రలో నటించిన నటి కూడా తెలంగాణ యాసలో గయ్యాళిగా ఆకట్టుకుంటుంది. బాలీవుడ్ నటుడు, థియేటర్ ఆర్టిస్ట్ మకరంద్ దేశ్ ముఖ్ పాండేను బాగా వాడుకున్నాడు దర్శకుడు.

టెక్నికల్ టీం:

ఈ సినిమాకు టెక్నికల్ టీం చాలా బలం. ముఖ్యంగా చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. పాటలన్నీ బాగానే ఉన్నాయి. పైగా ఈ సినిమా కోసం రామజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల, మహిత్ నారాయణ్ లాంటి వాళ్లు పాటలు రాసారు. దివంగత సీనియర్ ఎడిటర్ గౌతం రాజు ఎడిటింగ్ ఆకట్టుకుంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఎక్కడా ఖర్చుకి వెనకాడకుండా సినిమాని తీశారు నిర్మాత జి.వి.వి.గిరి. గరుడ వేగా అంజి అందించిన సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. సాంగ్స్, ఫైట్స్ చిత్రీకరణ రిచ్ గా ఉంది. దర్శకుడు సాయి శివాజీ కథ పాతదే కావడంతో.. స్క్రీన్ ప్లేలో కొంతవరకు ఆకట్టుకున్నాడు.

చివరగా ఒక్కమాట:

పరారి.. క్రైమ్ కామెడీ కానీ కండీషన్స్ అప్లై

రేటింగ్: 2.5/5

First published:

Tags: Movie reviews, Telugu Cinema, Tollywood Movie News

ఉత్తమ కథలు