హోమ్ /వార్తలు /సినిమా /

Nayeem Dairies Review: ‘నయీం డైరీస్’ రివ్యూ.. రియలిస్టిక్ క్రైమ్ డ్రామా..

Nayeem Dairies Review: ‘నయీం డైరీస్’ రివ్యూ.. రియలిస్టిక్ క్రైమ్ డ్రామా..

Nayeem Dairies Review: తెలుగు రాష్ట్రాల్లో నయీమ్ పేరు తెలియని వాళ్లుండరేమో అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆయన సంచలనాలకు కేంద్రబిందువు. జీవితం అంతా ఏదో ఓ దశలో మలుపులు తిరుగుతూ.. చివరికి ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన అతిపెద్ద గ్యాంగ్‌స్టర్ నయీం. ఆయన బయోపిక్ నయీం డైరీస్ విడుదలైంది.

Nayeem Dairies Review: తెలుగు రాష్ట్రాల్లో నయీమ్ పేరు తెలియని వాళ్లుండరేమో అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆయన సంచలనాలకు కేంద్రబిందువు. జీవితం అంతా ఏదో ఓ దశలో మలుపులు తిరుగుతూ.. చివరికి ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన అతిపెద్ద గ్యాంగ్‌స్టర్ నయీం. ఆయన బయోపిక్ నయీం డైరీస్ విడుదలైంది.

Nayeem Dairies Review: తెలుగు రాష్ట్రాల్లో నయీమ్ పేరు తెలియని వాళ్లుండరేమో అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆయన సంచలనాలకు కేంద్రబిందువు. జీవితం అంతా ఏదో ఓ దశలో మలుపులు తిరుగుతూ.. చివరికి ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన అతిపెద్ద గ్యాంగ్‌స్టర్ నయీం. ఆయన బయోపిక్ నయీం డైరీస్ విడుదలైంది.

ఇంకా చదవండి ...

నటీనటులు: వశిష్ట సింహా, దివి, బాహుబలి నిఖిల్‌, యజ్ఞాశెట్టి, సంయుక్తం హర్నాడ్‌, దేవి ప్రసాద్‌ తదితరులు..

నిర్మాత: సీఏ వరదరాజు(శ్రీ లక్ష్మీ నరసింహా ఎంటర్‌ప్రైజెస్‌)

దర్శకుడు: దాము బాలాజీ

కెమెరా: సురేష్‌ భార్గవ

సంగీతం: అరుణ్‌ ప్రభాకర్‌

ఎడిటింగ్‌: కిషోర్‌ మద్దాలి

తెలుగు రాష్ట్రాల్లో నయీమ్ పేరు తెలియని వాళ్లుండరేమో అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆయన సంచలనాలకు కేంద్రబిందువు. జీవితం అంతా ఏదో ఓ దశలో మలుపులు తిరుగుతూ.. చివరికి ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన అతిపెద్ద గ్యాంగ్‌స్టర్ నయీం. ఈయన జీవితం ఆధారంగా ‘నయీం డైరీస్‌’ సినిమా వచ్చింది. ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు దాము బాలాజీ. నయీంగా ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ వశిష్ట సింహా నటించాడు. మరి ఇది ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో చూద్దాం..

కథ:

భువనగిరి ప్రధానంగా సాగే కథ ఇది. అక్కడ్నుంచి మొదలైన నయీం కథను మొదలు పెట్టారు. ముందుగానే ఎన్‌కౌంటర్ పార్ట్ చూపించి ఆ తర్వాత కథను మొదలు పెట్టాడు దర్శకుడు బాలాజీ. చిన్నప్పటి నుంచి నయీం (వశిష్ట సింహా)కి ఆవేశం ఎక్కువ. డేరింగ్‌గా ముందుకెళ్లే రకం. ఏదో చేయాలనే తపనతోనే నక్సలిజంలోకి ఎంటర్ అవుతాడు. ఆయనకు తన అక్క (యజ్ఞా శెట్టి) అంటే ప్రాణం. ఆమెకు చిన్న కష్టం వచ్చినా కూడా తట్టుకోలేడు. అలాంటిది తాను నమ్మిన నక్సలిస్టులే అక్కకు అన్యాయం చేసారని తెలుసుకుని నయీం రగిలిపోతాడు. ఆ సమయంలో నక్సల్స్ నుంచి పోలీసుల వైపు వెళ్తాడు నయీం. అప్పటి వరకు పోలీసులతో ఫైట్ చేసి.. అప్పట్నుంచి పోలీసుల తరఫున యుద్ధం చేయడం మొదలుపెడతాడు. ఈ క్రమంలోనే వేల కోట్లు సంపాదిస్తాడు.. ఆయన్ని నమ్ముకుని పోలీసులు కూడా కోట్లకు కోట్లు కూడబెట్టుకుంటారు.. అలాగే నక్సల్స్‌ను కూడా చంపేస్తారు. అలా ఎదురులేకుండా సాగుతున్న నయీం మారణహోమానికి ఓ రాజకీయ నాయకుడు అడ్డు పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ..

కథనం:

ఇది రియలిస్టిక్ డ్రామా. నిజంగా జరిగిన కథను సినిమాటిక్ లిబర్టీ తీసుకుని చూపించారు. అందుకే కమర్షియల్ అంశాల కంటే కూడా రియలిస్టిక్ అంశాలే ఎక్కువగా ఉన్నాయి. అవి ఎంతమందిని ఎంగేజ్ చేస్తాయనేది ఆసక్తికరమే కానీ దర్శకుడు మాత్రం తాను అనుకున్నది అనుకున్నట్లుగా తెరపై చూపించే ప్రయత్నం చేసాడు. నయీం జీవితం గురించి తెలిసిన వాళ్లకు ఈ సినిమా మరింత కనెక్ట్ అయ్యే అవకాశాలున్నాయి. ఆయన జీవితాన్ని చిన్నప్పటి నుంచి మలుపు తిప్పిన వ్యక్తులను.. సంఘటనలను ఎపిసోడ్స్ మాదిరి షూట్ చేసుకుంటూ వెళ్లిపోయాడు దర్శకుడు. ముందు చిన్నతనం.. ఆ తర్వాత మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నపుడు ఓ నక్సలైట్ సాయంతో అన్నగా మారడం.. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ కేసులో జైలుకు రావడం.. అక్కడ నాటకీయ కోణాలు.. అలా ప్రతీ ఎపిసోడ్ చూపించాడు. నక్సల్‌ నుంచి పోలీస్‌ కోవర్ట్‌గా ఎందుకు మారాడు.. మారడానికి దారి తీసిన అంశాలేంటి అనేది కూడా చూపించాడు. ముఖ్యంగా అధికార ప్రభుత్వం తమ అవసరాల కోసం నయీంను వాడుకున్న తీరు కూడా ఆసక్తికరంగా చూపించాడు దర్శకుడు బాలాజీ. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన్ని ఎందుకు ఎన్‌కౌంటర్‌ చేసారు.. చేయడానికి దారి తీసిన కారణాలేంటి అనేది కూడా బాగానే చూపించాడు. ఓ వైపు నక్సల్స్, మరోవైపు పోలీసులు, ఇంకోవైపు రాజకీయ నాయకులు నయీంను తమ అవసరాల కోసం ఎలా వాడుకున్నారు.. చివరికి నయీంని ఎలా బలిపశువుని చేశారనేది ఇందులో దర్శకుడు దాము బాలాజీ క్లారిటీగా చూపించాడు. అత్యంత వివాదాస్పద, సంచలనాత్మక గ్యాంగ్‌స్టర్ కథని డాక్యుమెంటరీగా చూపించాడు. కమర్షియల్ అంశాల కంటే కూడా అనుకున్న విధంగా చూపించే ప్రయత్నం అయితే బాగానే చేసాడు. తన తమ్ముడు, అక్కకు పార్టీ చేసిన అన్యాయం నుంచి.. చివరికి నయీం బలైపోయినంత వరకు కథ పూర్తిగా చూపించాడు దర్శకుడు. అంతేకాదు.. మావోయిస్టు అగ్రనేతలు వీరన్న, రవన్న, సోమన్న, మోహన్‌రెడ్డి, సాగరన్న, గణేష్‌, సాంబా శివుడి పాత్రలను.. వాళ్లతో నయీంకు ఉన్న సంబంధాలను కూడా చూపించాడు. ఆయన్ని అడ్డు పెట్టుకుని దాదాపు 20కిపైగా ఐపీఎస్‌, ఐఎఎస్‌ స్థాయి అధికారులు కోట్లకు కోట్లు సంపాదించడం.. నయీం అండతో రాజకీయ నాయకుల సెటిల్‌మెంట్స్ కూడా చూపించారు. ఆ కథతో కనెక్షన్ ఉంటే సినిమా ఇంకా బాగా రిలేట్ చేసుకోవచ్చు.

నటీనటులు:

నయీం పాత్రలో వశిష్ట సింహా చక్కగా నటించాడు. ఆయన పాత్రకు న్యాయం చేసాడు. ముఖ్యంగా డైలాగ్ డెలవరీ.. వాయిస్ అదనపు బలం. హీరోయిన్ దివి బాగానే ఉంది. అక్క పాత్రలో యజ్ఞా అదరగొట్టింది. మిగిలిన వాళ్లంతా ఓకే.. దర్శకుడు దేవీ ప్రసాద్ కూడా నక్సలైట్ పాత్రలో బాగున్నాడు.

టెక్నికల్ టీం:

ఈ సినిమాకు సంగీతం పెద్దగా ప్లస్ అవ్వలేదు.. అలాగని మైనస్ కాదు. బ్యాగ్రౌండ్ స్కోర్ పర్లేదు. ఎడిటింగ్ ఇంకా షార్ప్‌గా ఉండుంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ బాగుంది. అడవులను బాగానే చూపించారు. దర్శకుడు దాము బాలాజీ తన వంతు ప్రయత్నం బాగానే చేసాడు. నయీం పాత్రను మ్యాగ్జిమమ్ తెరపై ఆవిష్కరించాడు. అయితే కమర్షియల్ అంశాలు లేకపోవడం సినిమాకు మైనస్.

చివరగా ఒక్కమాట:

‘నయీం డైరీస్’.. కథ తెలిస్తే కనెక్ట్ అయ్యే బయోపిక్..

రేటింగ్: 2.75/5

First published:

Tags: Movie reviews, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు