Richa gangopadhyay: ఆ విషయాన్ని సీక్రెట్ గా ఉంచిన ప్రభాస్ హీరోయిన్.. ఆ పోస్టుతో అసలు విషయం అలా?

Richa gangopadhyay

Richa gangopadhyay: టాలీవుడ్ హీరోయిన్ రీచా గంగోపాధ్యాయ్. ఒకప్పుడు టాలీవుడ్ లో మంచి క్రేజ్ అందుకున్న ఈ బ్యూటీ గతంలోనే సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది. ఇండస్ట్రీలో ఉన్నంతకాలం తన నటనకు మంచి గుర్తింపు అందుకుంది.

  • Share this:
    Richa gangopadhyay: టాలీవుడ్ హీరోయిన్ రీచా గంగోపాధ్యాయ్. ఒకప్పుడు టాలీవుడ్ లో మంచి క్రేజ్ అందుకున్న ఈ బ్యూటీ గతంలోనే సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది. ఇండస్ట్రీలో ఉన్నంతకాలం తన నటనకు మంచి గుర్తింపు అందుకుంది. తన అందంతో ఎంతోమంది ఫాలోయింగ్ ను పెంచుకుంది. ఇక సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియాతో మళ్లీ అభిమానులకు దగ్గరైంది.

    2010లో లీడర్ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకోగా ప్రభాస్ నటించిన మిర్చి సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. ఇక 2013లో భాయ్ సినిమాలో చివరి సారిగా నటించగా ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యింది ఈ బ్యూటీ. అతి తక్కువ సమయంలో తనకంటూ ఓ సక్సెస్ అందుకుంది.

    ఇక ఆ తర్వాత తన చిన్ననాటి స్నేహితుడైన జో లాంగేల్లా ను సీక్రెట్ గా ప్రేమ పెళ్లి చేసుకుంది. ఇక ఆ తర్వాత ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకోగా మళ్లీ మరొక విషయాన్ని కూడా సీక్రెట్ గా ఉంచింది. తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా అందులో తను తన భర్తతో కనిపించడంతో పాటు ప్రెగ్నెంట్ గా కనిపించింది. అంతేకాకుండా ఈ ఫోటో తో పాటు మరో పోస్టు ద్వారా అసలు విషయాన్ని బయట పెట్టింది రీచా. తనకు మే 27న చిన్నారి జన్మించిందని తెలిపింది. ఇక ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా తెలిపానని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తమ చిన్నారి ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.
    Published by:Navya Reddy
    First published: