megastar chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రతి ఒక్కరికి అభిమానం. ఇక ఆయన నటించే సినిమాల కోసం అభిమానుల ఎదురు చూపుల్లో ఎంతో అభిమానం కనిపిస్తుంది. ఇక ఆయన గురించి ఏదైనా విషయం తెలిస్తే చాలు ఉప్పొంగిపోతారు. ఇక ఆయన గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటిది ఆయన గురించి ఆయనే కొన్ని విషయాలు పంచుకున్నాడు.
తాజాగా చిరంజీవి ఓ మీడియాలో పాల్గొనగా తనతో పాటు తన బెస్ట్ ఫ్రెండ్ డాక్టర్ సత్యప్రసాద్ కూడా పాల్గొన్నాడు. సత్య ప్రసాద్ చిరంజీవితో పాటు కలిసి చదువుకున్నాడు. ఇక ఈయన యాక్టర్ గా, ఆయన డాక్టర్ గా మంచి స్థానంలో నిలిచారు. ఇక ఇప్పటికీ వీరి స్నేహం ఎంతో దృఢంగా ఉండగా.. సత్య ప్రసాద్ కొన్ని విషయాలు పంచుకున్నారు. వాళ్ల ఇద్దరిదీ చెరో సైకిలట. ఒక వారం నీ సైకిల్ ఒక వారం నా సైకిల్.. ఎవరి సైకిల్ అయితే వాళ్ళు కూర్చోవాలి.. రెండోవారు తొక్కాలి అంటూ అలా పాఠశాలకు వెళ్లారట.
చిరంజీవి తండ్రి కొణిదెల వెంకట్రావు ఎక్సైజ్ కానిస్టేబుల్ గా ఉద్యోగరీత్యా ఎప్పుడు ట్రాన్స్ ఫర్ అయ్యేవారని, ఇక ఆ సమయంలో పిల్లల చదువులకు ఇబ్బంది రాకూడదని చిరంజీవిని అమ్మమ్మగారి ఊరు మొగల్తూరు లో ఉంచి చదివించారని తెలిపాడు సత్య ప్రసాద్. అలా 7,10 తరగతుల తో పాటు డిగ్రీ వరకు కలిసి చదువుకున్నారట. ఇక చిరంజీవి ఎప్పుడూ అల్లరి చేష్టలు చేస్తూ ఉండేవారని, తనకేమో పుస్తకం తప్ప వేరే లోకం ఉండేది కాదని అందరూ వాళ్లను చూసి వీళ్లిద్దరు ఎలా కలిశారని అనుకునేవారని తెలిపాడు.
ఇక కాలేజీ రోజుల్లో చిరంజీవి ఏ అమ్మాయిని ఇష్టపడ లేదని, కానీ తనకు చాలామంది ప్రేమ లేఖలు రాశారని చిరంజీవి సీక్రెట్ బయట పెట్టాడు సత్య ప్రసాద్. పదోతరగతి లోని చిరంజీవికి ఎక్కువ లవ్ లెటర్స్ వచ్చేవని దాదాపు 10 నుంచి 15 ప్రేమలేఖలు ఆయనకు వచ్చాయని తెలిపాడు. ఆ రోజుల్లో చిరంజీవి చాలా స్టైల్ గా ఉండేవారని, ఆ సమయంలోనే చాలా బ్రాడ్ గా ఆలోచించి తనకొచ్చిన ప్రేమలేఖలు అన్నీ పక్కన పెట్టే వారిని తెలిపాడు. అంటే కాని ఆడ పిల్లల దగ్గరకు వెళ్లి ఇలా ఎందుకు రాశారని ఎన్నడు అడగలేదట. ఇక చిరంజీవి ఫ్యామిలీ లో అందరూ తన టైం మంచి ప్రేమను చూపించే వాళ్ళని అలా ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు సత్యప్రసాద్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Chiranjeevi Best Friend, Chiranjeevi childhood, Chiranjeevi School Days, Dr Satya Prasad, చిరంజీవి, చిరంజీవి ప్రేమ లేఖలు, డాక్టర్ సత్య ప్రసాద్