Megastar Chiranjeevi: నాడు మెగాస్టార్‌ను ఇదేం డ్యాన్స్ అన్నారు.. కట్ చేస్తే నేడు ఈ స్థాయిలో?

Megastar Chiranjeevi

Megastar Chiranjeevi: టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి, ఆయన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే తన నటనతో తెలుగు ప్రేక్షకులనే కాకుండా ఇతర భాషల ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

  • Share this:
    Megastar Chiranjeevi: టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి, ఆయన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే తన నటనతో తెలుగు ప్రేక్షకులనే కాకుండా ఇతర భాషల ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈయన నటుడిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎంతో మంది ప్రజల హృదయాలలో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే ఈయన డాన్స్ ను ఓ సినీ మేనేజర్ విమర్శించాడు.

    చిరంజీవి నటన విషయంలో ఇప్పటివరకు ఎవరూ వేలెత్తి చూపించలేదు. ముఖ్యంగా ఆయన చేసే డాన్స్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ సీనియర్ హీరోలు కూడా చిరంజీవి చేసినట్లుగా డాన్స్ చేయలేరు అనే చెప్పాలి. ఇప్పటికీ తన వయసు మీద పడ్డ కూడా తన డాన్స్ స్టెప్పులతో మాత్రం యంగ్ గానే కనిపిస్తాడు. అటువంటి స్టార్ హీరో డాన్స్ నే విమర్శించారు.

    ఇది కూడా చదవండి:అప్పా ఆచార్య గురించి రామ్ చరణ్ ఎమోషనల్ వీడియో.. చూస్తే వావ్ అనాల్సిందే!

    చిరంజీవి మొదట్లో నటించిన తన ఐదవ సినిమా షూటింగ్ సమయంలో ఓ పాటకి డాన్స్ వేశాడు. ఈయన డాన్స్ చూసి అందరూ ఫిదా అయ్యారు. ఆ సినిమాకు మేనేజర్ గా పని చేసిన వెంకన్న దగ్గరికి చిరంజీవి వెళ్లి డాన్స్ ఎలా చేసాను అని అడిగాడు. దాంతో ఆయన.. ఆ.. నీ వెనుక ఉన్న డాన్సర్లు ఏం చేశారో.. నువ్వు కూడా అదే చేశావు అంటూ కాస్త విమర్శించే విధంగా మాట్లాడాడు.

    ఇది కూడా చూడండి: హీరోయిన్ కొంగు పట్టుకొని భార్యకు దొరికిపోయిన మెగాస్టార్.. ఆతర్వాత ఎం జరిగిందంటే?

    చిరంజీవికి ఆ మాట వినగానే ఇంకా ఏదైనా చేయాలని కొత్తగా ఆలోచించడం మొదలు పెట్టాడు. డాన్స్ మాస్టర్ చెప్పినట్టు కాకుండా దానికి అదనంగా మరింత కొత్తగా చేయాలని ఫిక్స్ అయ్యి మొత్తానికి డాన్స్ మాస్టర్ ల కంటే ఎక్కువగా డాన్స్ చేసి చూపించాడు. దీంతో ఈయన డాన్స్ కు కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. మొత్తానికి ఆ మేనేజర్ విమర్శించడం వల్లే తనలోని అసలు టాలెంట్ బయట పెట్టాడు చిరు. ఇక చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాల రీమేక్ లో నటించడానికి సిద్ధంగా ఉన్నాడు.
    Published by:Navya Reddy
    First published: