TOLLYWOOD MEGAHERO VAISHNAV TEJ AND DIRECTOR KRISH KONDAPOLAM FILM FIRST LOOK RELEASE NR
Kondapolam - Vaishnav Tej: వైష్ణవ్ తేజ్ కొండ పొలం ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్.. ఎలా ఉందంటే?
Kondapalem - Vaishnav Tej
Kondapolam - Vaishnav Tej: టాలీవుడ్ హీరో వైష్ణవ్ తేజ్ గురించి అందరికీ పరిచయమే. కేవలం ఒక్క సినిమాతో స్టార్ గా మారిన ఈ మెగా హీరో.. ఆ తర్వాత వరుసగా పలు సినిమాలలో అవకాశాలు
Kondapolam - Vaishnav Tej: టాలీవుడ్ హీరో వైష్ణవ్ తేజ్ గురించి అందరికీ పరిచయమే. కేవలం ఒక్క సినిమాతో స్టార్ గా మారిన ఈ మెగా హీరో.. ఆ తర్వాత వరుసగా పలు సినిమాలలో అవకాశాలు అందుకుంటున్నాడు. దీంతో మెగా అభిమానులు వైష్ణవ్ తేజ్ సినిమా కోసం కూడా బాగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది. అతి తక్కువ సమయంలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన సినిమా లుక్, పోస్టర్ విడుదల కాగా ప్రస్తుతం వైరల్ గా మారింది.
బుచ్చిబాబు దర్శకత్వంలో ఉప్పెన సినిమాతో హీరోగా తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ సినిమా కంటే ముందు చిరంజీవి నటించిన సినిమాలో బాలనటుడిగా పరిచయమయ్యాడు. ఇక ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోగా.. ఈ మెగా హీరో కూడా తన మొదటి సినిమాతోనే తన నటనకు మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఇటీవలే జాగర్లమూడి, వైష్ణవ్ సినిమాకు కొండపొలం అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేయగా.. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్ లో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వైష్ణవ్ తేజ్ సీరియస్ లుక్ లో కనిపించగా కొండపొలం అనే టైటిల్ ను విడుదల చేశారు. ఇక ఇందులో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా ఆసక్తిగా అనిపించింది.
ఇక ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాకుండా నాజర్, కోట శ్రీనివాస్ రావు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ వినిపిస్తున్నాడు. రాజు రెడ్డి, జె.సాయిబాబు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిర్మాతలుగా చేస్తున్నారు. ఇక ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఈ పోస్టర్ మాత్రం మెగా అభిమానులను బాగా ఆకట్టుకుంది.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.