Kondapalem - Vaishnav Tej: టాలీవుడ్ హీరో వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన పనిలేదు. కేవలం ఒక్క సినిమాతో స్టార్ గా మారిన ఈ మెగా హీరో.. ఆ తర్వాత వరుసగా సినిమాలలో అవకాశాలు అందుకుంటున్నాడు. దీంతో మెగా అభిమానులు వైష్ణవ్ తేజ్ సినిమా కోసం కూడా బాగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది. అతి తక్కువ సమయంలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే గత వారం ఆయన సినిమా లుక్, పోస్టర్ విడుదల చెయ్యగా ఇప్పుడు రకుల్ ప్రీత్ 'ఒబులమ్మ' పాటను విడుదల చేశారు. ఆ పాట ప్రస్తుతం వైరల్ గా మారింది.
బుచ్చిబాబు దర్శకత్వంలో ఉప్పెన సినిమాతో హీరోగా తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు వైష్ణవ్ తేజ్. ఈ సినిమాకంటే ముందు చిరంజీవి నటించిన సినిమాలో బాలనటుడిగా పరిచయమయ్యాడు. ఇక ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోగా.. ఈ మెగా హీరో కూడా తన మొదటి సినిమాతోనే తన నటనకు మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో నటిస్తున్నాడు.
ఇది కూడా చదవండి: వైష్ణవ్ తేజ్ కొండ పొలం ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్.. ఎలా ఉందంటే?
ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను విడుదల చెయ్యగా మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరాకేకుతున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాకుండా నాజర్, కోట శ్రీనివాస్ రావు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ వినిపిస్తున్నాడు. రాజు రెడ్డి, జె.సాయిబాబు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిర్మాతలుగా చేస్తున్నారు. ఇక ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయడానికి సిద్ధం అయ్యారు.
'కొండపొలం' అనే నవల ఆధారంగా తేరాకేకుతున్న ఈ సినిమా రూరల్ బ్యాక్ డ్రాప్ తో నడవనుంది. ఈ సినిమా నుండి ఈరోజు రిలీజ్ అయిన 'ఒబులమ్మా' అనే పాట విడుదల అవ్వగా మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Director krish, Kondapalem, Megahero, Rakul preeth, Tollywood, Vaishnav tej