Ram Charan: రామ్ చరణ్ తన కారు డ్రైవర్ నెల జీతం ఎంతో తెలుసా?

Ram Charan

Ram Charan: టాలీవుడ్ స్టార్ మెగా యంగ్ హీరో రామ్ చరణ్ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బాగా బిజీగా ఉన్నాడు. కెరీర్ మొదట్లో అంతగా గుర్తింపు తెచ్చుకోలేని రామ్

  • Share this:
    Ram Charan: టాలీవుడ్ స్టార్ మెగా యంగ్ హీరో రామ్ చరణ్ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బాగా బిజీగా ఉన్నాడు. కెరీర్ మొదట్లో అంతగా గుర్తింపు తెచ్చుకోలేని రామ్ చరణ్ ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నాడు. తెలుగు రాష్ట్రాలలో మంచి అభిమానాన్ని గెలుచుకున్నాడు. అతి తక్కువ సమయంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. ఇదిలా ఉంటే తన కారు డ్రైవర్ కు ఇచ్చే జీతం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

    మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి, పవన్ కళ్యాణ్ తర్వాత అందుకున్న క్రేజ్ చరణ్ మాత్రమే. తెర ముందు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్.. తెరవెనుక మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా నిలిచాడు. ఎప్పుడు ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటాడు. వారితో ఎంతో ఆప్యాయంగా ఉంటాడు. ఎంతోమందికి తన వంతు సహాయం చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు. కోవిడ్ సమయంలో కూడా ముందుకు వచ్చి ఎంతో మంది ప్రజలను కాపాడాడు.

    బయట ఎంతో మందికి సహాయం చేసే రామ్ చరణ్.. తన కారు డ్రైవర్ కు నెలకు రూ.40 వేల జీతాన్ని ఇస్తాడట. అంటే ఒక్క నెలకు సాఫ్ట్ వేర్ ఉద్యోగికి ఇచ్చేంత జీతాన్ని తన కారు డ్రైవర్ కి ఇస్తున్నాడు చరణ్. ప్రస్తుతం ఈ విషయం గురించి బాగా వైరల్ గా మారగా రామ్ చరణ్ మనసు ఎంతో మంచిది అని పొగుడుతున్నారు అభిమానులు. అంతేకాకుండా కరోనా సమయంలో పనులు ఆగిపోయిన కూడా ప్రతి ఒక్కరికి నెల జీతాన్ని ఇచ్చేవాడట చరణ్.

    ఇక ప్రస్తుతం చరణ్ వరుస సినిమాలలో బిజీగా ఉండగా.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో చిరంజీవితో పాటు నటిస్తున్నాడు. అంతేకాకుండా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయనున్నసంగతి తెలిసిందే.
    Published by:Navya Reddy
    First published: