హోమ్ /వార్తలు /సినిమా /

Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్‌ హెల్త్‌ బులెటిన్‌ రిలీజ్.. మరికొన్ని రోజులు అక్కడే!

Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్‌ హెల్త్‌ బులెటిన్‌ రిలీజ్.. మరికొన్ని రోజులు అక్కడే!

Sai Dharam Tej Accident

Sai Dharam Tej Accident

Sai Dharam Tej Accident: సెప్టెంబర్ 10వ తేదీ శుక్రవారం సాయంత్రం కేబుల్ బ్రిడ్జి సమీపంలో సినీనటుడు, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ బైక్ పై ప్రయాణం చేస్తూ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే అతనిని అపోలో ఆస్పత్రిలో చేర్పించి మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నారు.

ఇంకా చదవండి ...

  Sai Dharam Tej Accident: సెప్టెంబర్ 10వ తేదీ శుక్రవారం సాయంత్రం కేబుల్ బ్రిడ్జి సమీపంలో సినీనటుడు, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ బైక్ పై ప్రయాణం చేస్తూ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే అతనిని అపోలో ఆస్పత్రిలో చేర్పించి మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నారు. ఈ మేరకు అధిక గాయాలైన సాయి ధరమ్ తేజ్ కు కాలర్ బోన్ సర్జరీ నిర్వహించిన వైద్యులు తాజాగా తన ఆరోగ్య పరిస్థితి పై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఈ క్రమంలోనే అపోలో వైద్యులు మాట్లాడుతూ సాయి ధరమ్ తేజ్ పరిస్థితి నిలకడగా ఉందని.. అతను మెల్లిమెల్లిగా కోలుకుంటున్నాడని వెల్లడించారు.

  ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడం చేత అతనికి వెంటిలేటర్ పై చికిత్స కూడా అవసరం లేదని, స్పృహలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్ తనే సొంతంగా శ్వాస కూడా తీసుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ మరి కొన్ని రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని అపోలో వైద్యులు సూచించారు.

  ఇది కూడా చదవండి:సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై వైద్యుల కీలక ప్రకటన.. ఏమన్నారంటే..

  బైక్ ప్రమాదం జరిగిన వెంటనే సాయి ధరమ్ తేజ్ ను మెడికవర్ ఆస్పత్రికి తరలించడం వల్ల అతనికి ఏ విధమైనటువంటి ప్రాణాపాయ స్థితి లేదని అతని శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా పని చేస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు.ఇకపోతే సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని ఎంతోమంది అభిమానులు సినీ సెలబ్రిటీలు కోరుకున్న విధంగానే సాయి తేజ్ ప్రమాదం నుంచి బయట పడినట్లు తెలుస్తోంది.

  ఇది కూడా చదవండి:సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అల్లు అరవింద్ కీలక ప్రకటన

  కాలర్ బోన్ సర్జరీ చేయడం వల్ల సాయి తేజ్ మరికొన్ని రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటూ వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని తెలియడంతో ప్రస్తుతం ఆయన నటిస్తున్నటువంటి రిపబ్లిక్ సినిమా కొన్ని రోజుల పాటు వాయిదా పడినట్లు తెలుస్తోంది.

  Published by:Navya Reddy
  First published:

  Tags: Sai Dharam Tej, Sai dharam tej health, Tollywood

  ఉత్తమ కథలు