Ravi Teja: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు వ్యవహారం బాగా హాట్ టాపిక్ గా మారింది. ఇన్ని రోజులు నిశ్శబ్దంగా ఉన్న ఈడీ అధికారులు మళ్లీ తెరపైకి డ్రగ్స్ కేసును తవ్వారు. ఇందులో టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రకుల్ ప్రీత్ సింగ్, ఛార్మి, రానా, నందు, రవితేజ ఇలా పలువురు సెలబ్రేటీల పేర్లు మీడియా ముందు బయటపడ్డాయి. ఇదిలా ఉంటే తాజాగా నటుడు రవితేజ ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యాడు.
ఇప్పటికే వీరందరూ విచారణలో హాజరవ్వగా.. వారిని ఈడీ అధికారులు తెగ ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారని పలు విషయాల గురించి విచారించారని తెలిసింది. ఇక తాజాగా రవితేజతో పాటు అతని కారు డ్రైవర్ శ్రీనివాస్ కూడా విచారణకు హాజరయ్యాడు. ఈరోజు ఉదయం విచారణలో పాల్గొనగా అందులో ఈడీ అధికారులు రవితేజను కూడా ఈ విషయాల గురించి ప్రశ్నిస్తున్నారని తెలిసింది.
ప్రస్తుతం డ్రగ్స్ కేసు ఒకటే కాకుండా మరోవైపు మనీ లాండరింగ్ వ్యవహారం కూడా బయటపడింది. ఇక ఈ విషయం గురించి కూడా రవితేజను విచారణ చేసినట్లు తెలిసింది. అందులో ఆయన బ్యాంక్ ఖాతాలను కూడా పరిశీలించారట. అనుమానంగా ఉన్నా కొన్ని విషయాలపై చర్చలు చేస్తున్నారని తెలిసింది. అంతేకాకుండా డ్రగ్స్ వ్యవహార యొక్క కీలక దారుడైనా కెల్విన్ తో ఏమైనా పరిచయం ఉందా అంటూ.. అతడి అకౌంట్ కి ఏమైనా డబ్బులను పంపించారా అని ప్రశ్నలు వేసినట్లు తెలిసింది.
ఇక పూరి, ఛార్మి, నందు లతో కూడా ఇలాగే ప్రశ్నించారని పైగా వారితో గంటలకొద్దీ విచారణ జరిగిందని తెలిసింది. రవితేజతో ప్రస్తుతం విచారణ జరుగుతుండగా ఎన్ని గంటల పాటు జరుగుతుందో అని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇదిలా ఉంటే పలువురు నటులు కూడా ఈ విషయం గురించి త్వరలోనే స్పందిస్తామని సోషల్ మీడియా వేదికగా తెలుపగా ఇటీవలే పూనం కౌర్ కూడా ఈ విషయం గురించి త్వరలోనే మీ ముందు పంచుకుంటాను అని తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Drug case, Ravi Teja, Tollywood, Tollywood drug case