ఫలక్ నుమా దాస్, హిట్ లాంటి సినిమాల తర్వాత విశ్వక్ సేన్ ఇమేజ్ బాగానే పెరిగిపోయింది. దానికి ముందు వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమా సైతం బాగానే ఆడింది. ఈ మూడు సినిమాల తర్వాత విశ్వక్ మార్కెట్ కూడా బానే పెరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయన నటిస్తున్న సినిమా పాగల్. నరేష్ కుప్పలి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్తైపోయింది. నిజానికి ప్యాండమిక్ ముందుగానే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా చాలా నెలలుగా వాయిదా పడుతూ వస్తుంది. చివరికి ఆగస్ట్ 14న పాగల్ సినిమా థియేటర్స్లో విడుదల కానుంది. దిల్ రాజు సమర్పిస్తున్న పాగల్ సినిమాను బెక్కం వేణుగోపాల్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పుడు ట్రైలర్ విడుదల చేసారు. దీనికి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో కనిపించిన ప్రతీ అమ్మాయిని ప్రేమించే పాగల్ ప్రేమికుడిగా కనిపిస్తున్నాడు విశ్వక్ సేన్. 1600 మంది అమ్మాయిలను ప్రేమించే పాత్రలో నటిస్తున్నాడు ఈ కుర్ర హీరో. చివరికి ఒక్క అమ్మాయితో సీరియస్గా ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి నివేదా పేతురాజ్.
ఆ తర్వాత ఏమైంది అనేది అసలు కథ. క్రేజీ లవ్ స్టోరీగా పాగల్ సినిమా వస్తుంది. ట్రైలర్ చూస్తుంటేనే సినిమా ఎలా ఉండబోతుందో కూడా క్లారిటీ వచ్చేసింది. ఆగస్ట్ 14న భారీగానే పాగల్ సినిమాను విడుదల చేయబోతున్నారు. మొత్తానికి మరి చూడాలిక.. ఈ సినిమాతో విశ్వక్ సేన్ ఎలాంటి మాయ చేయబోతున్నాడో..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Paagal film, Telugu Cinema, Tollywood, Vishwak Sen