మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికల వేళ సినీ నటి, ఎమ్మెల్యే రోజా (Roja) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీచేస్తున్న నటుల్లో ఎవరు..ఎవరికీ శత్రువులు కాదని.. తామందరం ఒక్కటేనని ఆమె చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఎవరు గెలిచినా, ఎవరు ఓడిపోయినా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు. పక్క నుంచి మాట్లాడేవారి వల్లే ఈ గొడవలు జరుగుతున్నాయని.. ఇప్పటికైనా విద్వేష రాజకీయాలను ఆఫాలని ఎమ్మెల్యే రోజా హితవు పలికారు. జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్లో జరుగుతున్న మా ఎన్నికల పోలింగ్‌లో రోజా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు రోజా. ఈ సందర్భంగా మా ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
MAA Elections Results: ముందే చెప్పేసిన మెగాస్టార్ Chiranjeevi
''ఎప్పుడూ లేనంత వాడీ వేడీగా మా ఎన్నికలు జరుగుతున్నాయి. మూవీ ఆర్టిస్ట్ అసోయేషన్‌లో 900 మంది మాత్రమే ఉన్నారు. మనందరం ఒకే కుటుంబం. కలిసి కట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఉదయం అందరూ కలివిడిగా కనిపించడం సంతోషంగా ఉంది. ఇప్పటికైనా మంచి వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు ప్యానెల్స్‌లోనూ నాతో పనిచేసిన నటులు ఉన్నారు. ఎవరు ఎక్కువ సమయం కేటాయించి కళాకారుల సమస్యలు తీరుస్తారో.. దానిని బట్టే ఓటు వేస్తారు. కరోనా కారణంగా చాలా మంది సినీ నటులు ఇబ్బందులు పడ్డారు. వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా అందరం కలిసే ఉండాలి. ఓడిపోయిన వారు గెలిచిన వారికి సహకరించాలి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం దిశగా ముందుకు వెళ్లాలి. చిన్న నటులను పెద్ద నటులు ఆదుకోవాలి. ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు కౌగిలించుకొని ఒక మంచి వాతావరణాన్ని సృష్టించారు. ఎన్నికల తర్వాత కూడా కలిసికట్టుగానే పనిచేయాలి. రెండు గ్రూపులుగా విభజించి రెచ్చగొట్టడం బాధాకరం.'' అని రోజా పేర్కొన్నారు.
MAA Elections: శివ బాలాజీ చెయ్యి కొరికిన నటి హేమ.. 'మా' ఎన్నికల్లో రచ్చ.. రచ్చ..
మా ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి కొనసాగుతోంది. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, నాగబాబు, బాలకృష్ణ, మోహన్ బాబు, మంచు మనోజ్, మంచు లక్ష్మి, పోసారి కృష్ణమురళి, బ్రహ్మానందం, వడ్డె నవీన్, సుమన్, సాయికుమార్, శ్రీకాంత్, నరేష్, సుమన్, ఉత్తేజ్, సుడిగాలి సుధీర్, రాఘవ, జెనీలియా, నిత్యా మీనన్ ఓటువేశారు. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఓటింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. లెక్కింపు పూర్తయిన తర్వాత ఇవాళ రాత్రి ఫలితాలు వెల్లడిస్తారు. రాత్రి 8 గంటలకు విజేతలెవరో అధికారంగా ప్రకటిస్తారు.లెక్కింపు పూర్తయిన తర్వాత ఇవాళ రాత్రి ఫలితాలు వెల్లడిస్తారు. రాత్రి 8 గంటలకు విజేతలెవరో అధికారంగా ప్రకటిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: MAA Elections, Manchu Vishnu, MLA Roja, Prakash Raj, Rk roja, Tollywood