హోమ్ /వార్తలు /సినిమా /

Tollywood: టాలీవుడ్‌లో ఎక్కువ నిడివి ఉన్న సూపర్ సినిమాలు ఇవే!

Tollywood: టాలీవుడ్‌లో ఎక్కువ నిడివి ఉన్న సూపర్ సినిమాలు ఇవే!

3. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్: రిజెక్ట్

3. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్: రిజెక్ట్

Tollywood: ఒక సినిమా సాధారణంగా 2.30 గంటల వరకు ఉంటుందని అందరికీ తెలుసు. ఇక దాని కంటే ఎక్కువ సమయంతో నడిచే సినిమాలను పెద్ద సినిమాలే అంటారు.

Tollywood: ఒక సినిమా సాధారణంగా 2.30 గంటల వరకు ఉంటుందని అందరికీ తెలుసు. ఇక దాని కంటే ఎక్కువ సమయంతో నడిచే సినిమాలను పెద్ద సినిమాలే అంటారు. ఇక పెద్దగా ఉన్న సినిమాలను చూస్తే నిజంగానే బోర్ గా అనిపిస్తుంది. కొన్ని పెద్ద సినిమాలు కథ బట్టి ఆసక్తిగా అనిపిస్తాయి. ఎక్కువ పాటల ద్వారా, యాక్షన్ ల ద్వారా సినిమా సమయాన్ని పెంచుతుంటారు. కొందరి హీరోల బట్టి కూడా ఎంత సమయమైనా చూడడానికి ప్రేక్షకులు ఇష్టపడతారు.

ఇక బాహుబలి సినిమా పెద్ద సినిమా కావడంతో దానిని రెండు భాగాలుగా రెండు సార్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక అంతే స్థాయిలో కొన్ని సినిమాలు ఉండగా అవేంటో తెలుసుకుందాం. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ నటించిన దానవీరశూరకర్ణ సినిమా దాదాపు 3 గంటల 46 నిమిషాలు ప్రసారమైంది. ఇందులో ఎన్టీఆర్ మూడు పాత్రలు గా నటించగా ఈ సినిమా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.

ఇక లవకుశ సినిమా 3 గంటల 28 నిమిషాలు సాగింది. ఇందులో సీతారాముల జీవితంలో లో ఏం జరిగిందని ఈ సినిమాను పెద్దగా చేశారు. ఇక రామారావు నటించిన పాండవ వనవాసం సినిమా 3 గంటల 18 నిమిషాలు ప్రసారమయింది. ఇక పాతాళభైరవి సినిమా కూడా 3 గంటల 15 నిమిషాలు నడిచింది.

హీరో కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా 3 గంటల 7 నిమిషాలు కాగా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన నిజం సినిమా కూడా 3 గంటలు 6 నిమిషాలు నడిచింది. ఈ సినిమాలో మహేష్ బాబు నటన బాగా ఆకట్టుకుంది.

ఇక ఈతరం సినిమా కూడా ఎక్కువ సమయం తో నడిచాయి. అది కూడా విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి.3 గంటల 6 నిమిషాలు ఉండగా ఇక ఈ సినిమా మరింత ఎక్కువ సమయం తో ఉండేనట. అంతేకాకుండా మరో సరికొత్త సినిమా మను అనే సినిమా కూడా 3 గంటలు నడిచింది. ఇలా ఇంకా పలు సినిమాలు మూడు గంటల సమయం దాటి ఉండగా.. నిజానికి పెద్ద సినిమా అంటే ప్రేక్షకులు చూడటానికి ఇబ్బంది పడతారు.

First published:

Tags: Arjun Reddy, Danaveera, Lavakusha, Lengthy films, Mahesh Babu, Nijam, NTR, Tollywood, Top films, Vijay devarkonda

ఉత్తమ కథలు