ఆ ముగ్గురు అగ్ర హీరోలతో కోడి రామకృష్ణ ప్రత్యేక అనుబంధం..

Kodi Ramakrishna | ఈ రోజు కన్నుమూసిన కోడి రామకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో 100 పైగా చిత్రాలను దర్శకత్వం వహించాడు. ఈ ఫీట్ సాధించిన నలుగురైదురు దర్శకుల్లో  ఆయన  ఒకరు. దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీలో ముగ్గురు హీరోలతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 22, 2019, 4:03 PM IST
ఆ ముగ్గురు అగ్ర హీరోలతో కోడి రామకృష్ణ ప్రత్యేక అనుబంధం..
కోడి రామకృష్ణ
  • Share this:
ఈ రోజు కన్నుమూసిన కోడి రామకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో 100 పైగా చిత్రాలను దర్శకత్వం వహించాడు. ఈ ఫీట్ సాధించిన నలుగురైదురు దర్శకుల్లో  ఆయన  ఒకరు. దాసరి నారాయణ రావు శిష్యుడిగా చిత్ర రంగం ప్రవేశం చేసిన కోడి రామకృష్ణ గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకున్నాడు.

ఇక ఆయన దర్శకత్వం వహించిన  ఒక్కో సినిమా  ఒక్కో ఆణిముత్యం. ఎంతో మంది హీరోలకు తన దర్శకత్వంలో భారీ సక్సెస్‌లను అందించాడు. ఆయన దర్శకత్వంలో వహించిన  పరిశీలిస్తే..మెగాస్టార్ చిరంజీవితో చేసిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’  సినిమాతోనే సంచలన విజయం సాధించాడు. ఈ సినిమా యేడాదికి పైగా థియేటర్స్‌లో నడిచింది.

ఆ తర్వాత ఈ దర్శకత్వంలో వచ్చిన ‘తరంగణి’ సినిమాతోనే సుమన్ హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా కూడా ఏడాదికి పైగా నడవడం విశేషం. ఇక కోడి రామకృష్ణకు తెలుగు ఇండస్ట్రీలో బాలకృష్ణ, అర్జున్, రాజశేఖర్‌లో ప్రత్యేక అనుబంధం ఉంది. ముఖ్యంగా  సోలో హీరోగా వరస ఫ్లాపుల్లో ఉన్న బాలకృష్ణకు ‘మంగమ్మ గారి మనవడు’తో గోల్డెన్ జూబ్లీ హిట్ అందించాడు. ఈ సినిమా కూడా ఏడాదికి పైగా నడవడం విశేషం.

ఆ తర్వాత బాలయ్యతో చేసిన ‘ముద్దుల మావయ్య, ముద్దుల మేనల్లుడు, మువ్వగోపాలుడు, ‘బాల గోపాలడు’, ముద్దుల కృష్ణయ్య, ‘భారతంలో బాలచంద్రుడు’ వంటి హిట్ సినిమాలను అందించిన ఘనత కోడి రామకృష్ణది. ఆ తర్వాత వీళ్లిద్దరి కలయికలో ప్రారంభమైన ఒక జానపద సినిమా మధ్యలో ఆగిపోయింది.

ఆ తర్వాత రాజశేఖర్‌తో తెరకెక్కించిన ‘తలంబ్రాలు’ కూాడా తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఆ తర్వాత వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘ఆహుతి’,స్టేషన్ మాస్టర్’ ‘అంకుశం’ తెలుగు సినిమా చరిత్రలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది.

అటు పరభాష నటుడైన అర్జున్‌తో కోడి రామకృష్ణ తెరకెక్కించిన ‘మన్నెంలో మొనగాడు’, ‘మా పల్లెలో గోపాలుడు’, ‘మా ఊరి మా రాజు’, ‘పుట్టింటికి రా చెల్లి’ వంటి బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందించాడు. మొత్తానికి కోడి రామకృష్ణ తన జీవితంలో ఈ ముగ్గురు హీరోలతో చేసిన సినిమాలు వాళ్ల కెరీర్‌లను పెద్ద మలుపు తిప్పాయి. వీళ్లే మరికొంత మంది హీరోలకు కూడా మెమరబుల్ హిట్స్ అందించిన ఘనత కోడిరామకృష్ణ. అటు వంటి దిగ్దర్శకుడు మన మధ్య లేకపోవడం టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు తీరని లోటు.
Published by: Kiran Kumar Thanjavur
First published: February 22, 2019, 4:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading