హోమ్ /వార్తలు /సినిమా /

Production No.1: మ‌ణిరాజ్ ద‌ర్శక‌త్వంలో పిఎస్ఆర్ ప్రొడ‌క్ష‌న్స్ వారి ప్రొడ‌క్ష‌న్ నెం.1 షూటింగ్ పూర్తి..

Production No.1: మ‌ణిరాజ్ ద‌ర్శక‌త్వంలో పిఎస్ఆర్ ప్రొడ‌క్ష‌న్స్ వారి ప్రొడ‌క్ష‌న్ నెం.1 షూటింగ్ పూర్తి..

ప్రొడక్షన్ నెం. 1 షూటింగ్ పూర్తి (Twitter/Photo)

ప్రొడక్షన్ నెం. 1 షూటింగ్ పూర్తి (Twitter/Photo)

Production No.1: మ‌ణిరాజ్ ద‌ర్శక‌త్వంలో పిఎస్ఆర్ ప్రొడ‌క్ష‌న్స్ వారి ప్రొడ‌క్ష‌న్ నెం.1 షూటింగ్ పూర్తి అయింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Production No.1: పృథ్విరాజ్‌(Prithivi Raj), అనూ మెహ‌త (Anu Mehtha) హీరో హీరోయిన్లుగా పిఎస్ఆర్ ప్రొడ‌క్ష‌న్స్ (PSR Productions) ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1(Production No. 1)గా రాబ‌రీ నేప‌థ్యంలో క్రైమ్ థ్రిల్ల‌ర్ గా ఓ క్రొత్త చిత్రం రూపొందుతోంది. ఈ మూవీ ద్వారా పి.మ‌ణిరాజ్ (P.ManiRaj) ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. పి.నాగ‌మ‌ణి స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌వీణ శివరాజ్(Praveen Shivaraj) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొత్త త‌ర‌హా క‌థ‌, క‌థనంతో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి ఓ ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. ఇప్ప‌టికే మొద‌లైన ఈ మూవీ షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు పి. మ‌ణిరాజ్ మాట్లాడుతూ - 27 రోజుల పాటు వికారాబాద్‌, హైద‌రాబాద్ మ‌రియు ప‌రిసర ప్రాంతాల్లోని అంద‌మైన లోకేష‌న్ల‌లో చిత్రీక‌ర‌ణ జ‌రిపినట్టు తెలిపారు.  ఔట్ పుట్ చాలా బాగా వ‌చ్చిందన్నారు. హీరో పృథ్విరాజ్‌, హీరోయిన్ అనూ మోమ‌త చక్క‌గా న‌టించారని చెప్పుకొచ్చారు.

టెక్నీషియ‌న్స్ అంద‌రూ పూర్తి స‌హ‌కారం అందించారన్నారు. షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ఒక రాబ‌రీ బ్యాక్‌డ్రాప్‌లో జ‌రిగే క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి న‌వంబ‌రు నెల‌లో రిలీజ్ చేయడానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

Tollywood Latest News Production No.1 Shoot Completed by PSR Productions under the direction of Maniraj Production No.1: మ‌ణిరాజ్ ద‌ర్శక‌త్వంలో పిఎస్ఆర్ ప్రొడ‌క్ష‌న్స్ వారి ప్రొడ‌క్ష‌న్ నెం.1 షూటింగ్ పూర్తి..,Maniraj,Production No 1,Tollywood,Telugu Cinema News,Maniraj Movie,Telugu News,Telugu Cinema News,Chirajeevi God Father,Nagarjuna The Ghost,మణిరాజ్,మణిరాజ్ ప్రొడక్షన్ నంబర్ 1 షూటింగ్ పూర్తి,పిస్ఆర్ ప్రొడక్షన్స్,నాగార్జున ది ఘోస్ట్,గాడ్ ఫాదర్,చిరంజీవి గాడ్ ఫాదర్
ప్రొడక్షన్ నెం.1 (Twitter/Photo)

త్వ‌ర‌లోనే ఈ సినిమా టైటిల్‌, ఫ‌స్ట్ విడుద‌ల చేస్తామని చెప్పారు. మొత్తంగా క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌లో ఇప్పటి వరకు ఎవరు చూడనటువంటి తరహాలో ఈ సినిమాను తెరకెక్కించినట్టు చెప్పారు. ఈ సినిమా కామన్ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Samantha - Pooja Hegde - Nidhhi: సమంత,పూజా హెగ్డే, నిధి అగర్వాల్ ఈ హీరోయిన్స్‌ మధ్య ఉన్న సంబంధం ఇదే..

పృథ్విరాజ్‌, అనూ మెహ‌త హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి

స‌మ‌ర్ఫ‌ణ‌: పి. నాగ‌మ‌ణి

బ్యాన‌ర్: పిఎస్ఆర్ ప్రొడ‌క్ష‌న్స్

నిర్మాత‌: ప్ర‌వీణ శివరాజ్

ద‌ర్శక‌త్వం: పి. మ‌ణిరాజ్

సినిమాటోగ్ర‌ఫి: ప‌ర‌శురామ్‌ ఎరుగ‌దిండి

ఎడిట‌ర్‌: సి. అక్ష‌య‌రాజ్‌

పీఆర్ఓ: శ్రీ‌ను-సిద్ధు

Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు