హోమ్ /వార్తలు /సినిమా /

Mohan Ji: టాలీవుడ్‌లో మరో విషాదం.. కరోనాతో ప్రముఖ స్టిల్ ఫోటో గ్రాఫర్ మోహన్ జీ కన్నుమూత..

Mohan Ji: టాలీవుడ్‌లో మరో విషాదం.. కరోనాతో ప్రముఖ స్టిల్ ఫోటో గ్రాఫర్ మోహన్ జీ కన్నుమూత..

కరోనాతో కన్నుమూసిన స్టిల్ ఫోటోగ్రాఫర్ ‘మోహన్ జీ’ (File/Photo)

కరోనాతో కన్నుమూసిన స్టిల్ ఫోటోగ్రాఫర్ ‘మోహన్ జీ’ (File/Photo)

Mohan Ji: సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.  భాషా భేదం లేకుండా  అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల్లో ఒక్కొక్కరుకు కన్నుమూస్తున్నారు. తాజాగా తెలుగు, కన్నడ, తమిళంలో పలు చిత్రాలకు స్టిల్ ఫోటోగ్రాఫర్‌గా పనిచేసిన మోహన్ జీ కన్నుమూసారు.

ఇంకా చదవండి ...

Mohan Ji: సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.  భాషా భేదం లేకుండా  అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల్లో ఒక్కొక్కరుకు కన్నుమూస్తున్నారు. ఏదో కొద్ది మంది మాత్రమే ఏజ్ ఫ్యాక్టర్‌తో కన్నుమూస్తే.. చాలా మంది కరోనా కాటుకు బలైపోతున్నారు. తాజాగా తెలుగుతో పాటు తమిళం, కన్నడలో 900 చిత్రాలకు స్టిల్ ఫోటోగ్రాఫర్‌గా పనిచేసిన మోహన్ జీ గురువారం రాత్రి కరోనాతో కన్నమూసారు. ఈయన పూర్తి పేరు   మాది రెడ్డి కృష్ణమోహన్ రావు. 1935లో గుంటూరులో పుట్టారు. సినీ ఇండస్ట్రీలో మోహన్ జీగా పేరు పొందారు. మోహన్ జీవ వాళ్ల నాన్న కృష్ణారావు విజయవాడలో శ్రీకాంత్ పిక్చర్స్ పంపిణీ సంస్థలో మేనేజర్ గా పనిచేసేవారు. తర్వాత వీళ్ళ కుటుంబం చెన్నైకి షిఫ్ట్ అయింది. తమ్ముడు జగన్ మోహన్ రావు తో కలసి మోహన్ జీ జగన్ జీ పేరుతో సినిమాలకు స్టిల్ ఫోటోగ్రాఫర్ గా వర్క్ చేయడం ప్రారంభించారు.

అన్న ఎన్టీఆర్ నటించిన ‘కాడేద్దులు ఎ కరం నేల’.. వీరి తొలి చిత్రం. అప్పటి నుండి దాదాపు 900 చిత్రాలకు ఈ సోదరులు స్టిల్ ఫోటోగ్రాఫర్స్‌గా పని చేశారు. దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు తో వీరిద్దరికీ మంచి అనుబంధం ఉండేది. ఆయన తొలి సినిమా ‘తాత మనవడు’ నుండి ‘ఒరేయ్ రిక్షా’ వరకూ వంద సినిమాలకు పని చేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు కృష్ణంరాజు, మురళీ మోహన్ చిత్రాలకే కాకుండా కన్నడలో రాజ్ కుమార్, విష్ణు వర్ధన్, తమిళంలో జెమినీ గణేషన్, రజినీకాంత్ చిత్రాలకు స్టిల్ ఫోటోగ్రాఫర్స్‌గా  పని చేశారు.ఈ సోదర ద్వయంలో చిన్నవాడైన జగన్ మోహన్ కొంత కాలం క్రితం కన్ను మూశారు.తాజాగా మోహన్ జీ కోవిడ్‌తో కన్నమూసారు. ఈయన మృతితో చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు