‘గ్యాంగ్ లీడర్’ సహా చిరంజీవి టైటిల్స్‌ను బాగానే వాడేసుకుంటున్న బయటి హీరోలు..

గత కొన్నేళ్లుగా తెలుగులో సూపర్ హిట్ అయినా  పాత సినిమాల టైటిల్స్‌ను కొత్త సినిమాలకు పెట్టడం కామన్ అయిపోయింది. ఇప్పటికే  విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న సినిమాకు ‘గ్యాంగ్ లీడర్’ అనే టైటిల్ ఖరారు చేసారు. నాని బాటలో మరికొంత మంది హీరోలు చిరంజీవి టైటిల్స్‌ పై కన్నేసారు.

news18-telugu
Updated: July 28, 2019, 3:03 PM IST
‘గ్యాంగ్ లీడర్’ సహా చిరంజీవి టైటిల్స్‌ను బాగానే వాడేసుకుంటున్న బయటి హీరోలు..
‘గ్యాంగ్ లీడర్’గా వస్తోన్న నాని
  • Share this:
గత కొన్నేళ్లుగా తెలుగులో సూపర్ హిట్ అయినా  పాత సినిమాల టైటిల్స్‌ను కొత్త సినిమాలకు పెట్టడం కామన్ అయిపోయింది. ఇప్పటికే  విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న సినిమాకు ‘గ్యాంగ్ లీడర్’ అనే టైటిల్ ఖరారు చేసారు. పేరు బాగానే మెగా ఫ్యాన్స్ మాత్రం నాని ఓ ఆట ఆడుకుంటున్నారు. నువ్వు గ్యాంగ్ లీడర్ ఏంటి ? ఇప్పటికీ ఎప్పటికీ గ్యాంగ్ లీడర్ అంటే చిరంజీవి అంటూ నానిపై దుమ్మెత్తి పోస్తున్నారు. నాని కొత్త సినిమాకు  ‘గ్యాంగ్ లీడర్‌’ టైటిల్‌పై మెగా ఫ్యాన్స్ పెద్ద రచ్చే చేస్తున్నారు.

‘గ్యాంగ్ లీడర్’గా వస్తోన్న నాని (పైల్ ఫోటో)


ప్రస్తుతం ఈ వివాదం సద్దు మణిగింది.ఇంకోవైపు బెల్లంకొండ శ్రీనివాస్..రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న సినిమాకు ‘రాక్షసుడు’ టైటిల్ ఫిక్స్ చేసారు. ఒకవైపు గ్యాంగ్ లీడర్‌, రాక్షసుడు’ టైటిల్స్‌పై మెగా హీరోలు రచ్చ నడుస్తుండగా..  తమిళ హీరో కార్తి..చిరంజీవికి హీరోగా బ్రేక్ ఇచ్చిన ఆల్ టైమ్ హిట్  ‘ఖైదీ’ సినిమా పేరును తన నెక్ట్స్ సినిమాకు ఫిక్స్ చేసుకున్నాడు.

‘రాక్షసుడు’గా వస్తోన్న బెల్లంకొండ శ్రీనివాస్ (ఫైల్ ఫోటో)


కార్తి సరసన రష్మిక మండన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ మార్చ్‌లో మొదలుకానుంది. ఈ సినిమాను తమిళంలో ‘మా నగరం’ ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. తమిళంలో ఎలాగే ‘ఖైదీ’ టైటిల్‌ను ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్..తెలుగులో కూడా అదే టైటిల్‌తో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

‘ఖైదీ’గా వస్తోన్న కార్తి (పైల్ ఫోటో)


మొత్తానికి మెగాస్టార్ చిరంజీవిని వాళ్ల ఫ్యామిలీ హీరోలకంటే బయటి హీరోలే ఎక్కువగా యూజ్ చేసుకుంటారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 28, 2019, 3:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading