TOLLYWOOD JUNIOR ARTIST JYOTHI REDDY SUSPICIOUS DEATH GETS CLARIFIED MBNR PK
Junior Artist Jyothi Reddy: రైలు పట్టాలపై శవమై తేలిన జూనియర్ ఆర్టిస్టు జ్యోతి రెడ్డి.. అసలు నిజం ఇదే..
రైలు ప్రమాదంలో కన్నుమూసిన జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతి రెడ్డి (junior artist jyothi reddy)
Junior Artist Jyothi Reddy: టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. షాద్ నగర్ రైల్వే ట్రాక్‌పై అనుమానాస్పదంగా తీవ్రగాయాలతో పడి ఉన్న సినిమా జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతి రెడ్డి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈమె మృతి వ్యవవహారంలో అనుమానాలు నివృత్తి అయ్యాయి.
టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. షాద్ నగర్ రైల్వే ట్రాక్‌పై అనుమానాస్పదంగా తీవ్రగాయాలతో పడి ఉన్న సినిమా జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతి రెడ్డి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈమె మృతి వ్యవవహారంలో అనుమానాలు నివృత్తి అయ్యాయి. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ రైల్వే స్టేషన్లో తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో సినిమా జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతి రెడ్డి వెంకటాద్రి రైలు నుంచి నిద్ర మత్తులో ప్లాట్ ఫామ్‌పై దుకినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కడప నుంచి హైదరాబాద్‌కు వస్తున్న జ్యోతి రెడ్డి కాచిగూడలో దిగాల్సి ఉండగా తెల్లవారుజామున నిద్ర మత్తులో షాద్ నగర్ స్టేషన్‌ను కాచిగూడ అనుకోని హడావిడిగా రైలు నుంచి తన లగేజీతో ప్లాట్ ఫామ్‌పైకి దూకిందని.. ఈ క్రమంలోనే జ్యోతి రెడ్డి రైలుకు ప్లాట్ ఫామ్‌కు మధ్యలో పడిపోయిందని తెలిపారు ప్రత్యక్ష సాక్షులు.
ఈ ప్రమాదంలో కాళ్ళు, నడుము భాగం తీవ్రంగా గాయపడ్డట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కేవలం కాచిగూడ అనుకోని బయటకు దుకడం వల్ల ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అదే విధంగా రైలు కింద పడ్డప్పుడు తోటి ప్రయాణికులు ఆమెతో చివరిసారిగా మాట్లాడారు. కొన్ని వివరాలు జ్యోతి ప్రయాణికులకు చెప్పింది. అంతకుముందు జ్యోతి రెడ్డి మరణంపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేసారు. అనుమానాస్పదంగా కన్ను మూసిన ఈమె మరణానికి కారణాలు కావాలంటూ వాళ్లు గొడవ చేసారు. ఆమె మరణంపై అనుమానాలున్నాయంటూ హాస్పిటల్ ముందు బైఠాయించి ధర్నా చేసారు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.