Home /News /movies /

Allu Arjun at road side tiffin center: రోడ్డు పక్కన బండి దగ్గర టిఫిన్ చేసిన అల్లు అర్జున్.. వీడియో వైరల్..

Allu Arjun at road side tiffin center: రోడ్డు పక్కన బండి దగ్గర టిఫిన్ చేసిన అల్లు అర్జున్.. వీడియో వైరల్..

అల్లు అర్జున్ (Allu Arjun)

అల్లు అర్జున్ (Allu Arjun)

Allu Arjun at road side tiffin center: హీరోలన్న తర్వాత కచ్చితంగా ఫైవ్ స్టార్ హోటల్స్‌లో ఉంటారు.. అక్కడే తింటారు అనుకుంటారు. కానీ తాజాగా అల్లు అర్జున్ చేసిన పని చూసి అంతా షాక్ అయిపోయారు. రోడ్డు పక్కనే ఉన్న టిఫిన్ బండి దగ్గరికి వెళ్లి సింపుల్‌గా తినేసి వచ్చాడు బన్నీ (Allu Arjun at road side tiffin center). ఈ వీడియో వైరల్ అవుతుందిప్పుడు.

ఇంకా చదవండి ...
హీరోలన్న తర్వాత కచ్చితంగా ఫైవ్ స్టార్ హోటల్స్‌లో ఉంటారు.. అక్కడే తింటారు అనుకుంటారు. కానీ కొందరు హీరోలు అలా ఇలా రెండు చోట్లా ఉంటారు. అందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఉంటాడు. ఈయన తాజాగా చేసిన ఓ పనితో సోషల్ మీడియా అంతా షేక్ అయిపోతుంది. ఈయన ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతుంది. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ అయిన విషయం తెలుసుకుని రావాలనుకున్నా కూడా.. ఆయనకు బాగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపిన తర్వాత మళ్లీ వెళ్లిపోయాడు బన్నీ. ప్రస్తుతం రాజమండ్రిలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. పుష్ప షూటింగ్ ప్రస్తుతం కాకినాడ ప్రాంతంలో జరుగుతుంది. దాంతో అక్కడి వంటలను ఆస్వాదిస్తున్నాడు.

తాజాగా రోడ్ పక్కనే ఉన్న ఒక హోటల్‌కు వెళ్లి అక్కడే టిఫిన్ చేసాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. గోకవరం సమీపంలో ఉన్న ఓ టిఫిన్ సెంటర్‌లో ఈయన తినేసాడు. 100 కోట్ల మార్కెట్ ఉన్న హీరో ఇంత సింపుల్‌గా ఉండటాన్ని చూసి అక్కడున్న వాళ్లంతా షాక్ అయిపోయారు. ఆయన సింప్లిసిటీకి ఫిదా అయిపోయారు. అక్కడున్న వాళ్లకు బిల్‌తో పాటు భారీగా టిప్ కూడా ఇచ్చేసాడు అల్లు అర్జున్. తాను వస్తున్నాననే విషయం చెప్పకుండా ఉన్నఫలంగా వచ్చేసాడు అల్లు అర్జున్. దాంతో రద్దీ కూడా ఏం లేదు.


ఆయన వచ్చాడనే విషయం తెలుసుకున్న తర్వాత చుట్టు పక్కలున్న అభిమానులు హోటల్ దగ్గరికి వచ్చారు. అయితే అప్పటికే ఆయన టిఫిన్ చేసి వెళ్లిపోయాడు. ఏదేమైనా ఈయన సింప్లిసిటీ చూసి భలే భలే అనుకుంటున్నారు. పుష్ప ది రైజ్ అంటూ మొదటి భాగాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రం డిసెంబర్‌లో రానుంది. క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది పుష్ప ది రైజ్. ఆ తర్వాత పుష్ప ది ఎండ్ రానుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్‌గా రష్మిక మందన్న నటిస్తుంది. విలన్ పాత్రలో మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన దాక్కో దాక్కో మేక పాట యూ ట్యూబ్‌లో 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Allu Arjun, Allu arjun pushpa movie, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు