Allu Arjun: టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే చాలు.. ఆయన గురించి ఏదైనా సినిమా అప్ డేట్ వస్తుందో లేదా ఏదైనా ఫోటో వచ్చిందా అని ఆయన అభిమానులు తెగ ఎదురు చూస్తుంటారు. ఇక ఈయనకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వస్తే చాలు.. ఇక ఆ ఫోటో మొదట అభిమానుల ఫోన్ లో ఓపెన్ అవడం ఖాయం. అంతా అభిమానం ఉన్న అల్లు అర్జున్ కు తన భార్య తను చేసిన పనికి షాక్ అయింది.
స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో ఈమధ్య బాగా యాక్టివ్ గా మారింది. ఇక తను ఏ పోస్ట్ చేసిన అది వైరల్ కావాల్సిందే. ఎందుకంటే ఆమె అల్లు అర్జున్, తన కూతురు కలిసి చేసే సందడిలను తెగ పంచుకుంటుంది. ఇక తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫోటో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది. అంతేకాకుండా ఆ ఫోటో గురించి హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ ఫోటో లో ఏముందంటే అల్లు అర్జున్ ఒక పుస్తకం చదువుకుంటూ ఉన్నాడు.
అంతేకాకుండా ఆ ఫోటోకు 'రేర్' అంటూ కామెంట్ చేసింది. ఇంతకీ ఆ కామెంట్ కు అర్థం ఏంటంటే.. అల్లు అర్జున్ కి మామూలుగా డాన్స్, మ్యూజిక్ అంటే ఇష్టమని తెలుసు. కానీ కొత్తగా పుస్తకం చదవడం తో కాస్త స్టోరీ ఆసక్తిగా అనిపించింది. ఇక దీనిని ఉద్దేశించే స్నేహ రెడ్డి బన్నీ లో పుస్తకం చదివే మార్పు చూసి షాక్ అయ్యింది. ప్రస్తుతం వైరస్ వల్ల షూటింగులో బ్రేక్ పడటంతో హీరోలంతా ఇలా ఇంట్లో కూర్చొని ఏదో ఒక పని తో సోషల్ మీడియాలో చిక్కుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allu Arjun, Corona virus, Covid-19, Pushpa film, Reading books, Sneha reddy, Tollywood