Happy Father’s Day: టాలీవుడ్ ఐకాన్ అల్లు అర్జున్ గురించి తెలినోలే లేరు. ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోగా నిలిచాడు. ప్రస్తుతం వరుస సినిమాలలో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే బన్నీ ఫ్యామిలీ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరగా ఉంటారు. ముఖ్యంగా తన సతీమణి స్నేహ రెడ్డి కూడా అభిమానులతో బాగా టచ్ లో ఉంటుంది. ఇటీవలే అత్యధిక ఫాలోవర్స్ ని సంపాదించుకొని మొదటి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.
View this post on Instagram
బన్నీ ఫ్యామిలీ పరంగా కూడా ఎంతో కేరింగ్ తీసుకుంటాడు. తీరిక సమయంలో ఫ్యామిలీతో తెగ ఎంజాయ్ చేస్తుంటాడు. ఇక తన పిల్లలతో బాగా గడుపుతాడు. స్నేహ ఎప్పటికప్పుడు వీళ్లకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటుంది. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా స్నేహ రెడ్డి తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ వీడియో షేర్ చేసుకుంది. అందులో అల్లు అర్జున్ తన కూతురు, కొడుకుతో కలసి కేక్ కట్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. హ్యాపీ ఫాదర్స్ డే అని క్యాప్షన్ ఇవ్వగా.. ఈ వీడియోని చూసిన బన్నీ అభిమానులు సో క్యూట్ అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allu arha, Allu Arjun, Allu ayaan, Allu sneha reddy, Happy Fathers Day, Tollywood