Allu Arjun Family drive: అర్ధరాత్రి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై అల్లు అర్జున్ కుటుంబం.. ఫన్ రైడ్ చేసిన బన్నీ..

అల్లు అర్జున్ (Allu Arjun)

Allu Arjun Family drive: హైదరాబాద్‌లో కొత్తగా మరో టూరింగ్ స్పాట్ కూడా చేరిపోయింది. అదే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) కూడా ఇదే చేసాడు. ఈయనకు ఏ మాత్రం సమయం దొరికినా వెంటనే కుటుంబంతో పాటు బయటికి వచ్చేస్తుంటాడు..

  • Share this:
హైదరాబాద్‌లో ఇదివరకు టూరిస్టు స్పాటులుగా ట్యాంక్ బండ్, ఆర్ఎఫ్‌సీ అంటూ చెప్పుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు కొత్తగా మరో స్పాట్ కూడా చేరిపోయింది. అదే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి. అర్ధరాత్రి వరకు దానిపై హంగామా చేస్తున్నారు ప్రజలు. అక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం కామన్ ప్రజలు మాత్రమే కాదు.. సెలబ్రిటీస్‌కు కూడా అడ్డాగా మారిపోయింది కేబుల్ బ్రిడ్జి. అక్కడికి వచ్చి కాసేపు అలా చూసుకుని వెళ్లిపోతున్నారు. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా ఇదే చేసాడు. ఈయనకు ఏ మాత్రం సమయం దొరికినా కూడా వెంటనే కుటుంబంతో పాటు బయటికి వచ్చేస్తుంటాడు.. వాళ్లతోనే గడుపుతుంటాడు. తాజాగా తన ఫ్యామిలీతో కలిసి బయటికి వచ్చాడు బన్నీ. తన కూతురు అర్హ.. కొడుకు అయాన్‌తో కలిసి కేబుల్ బ్రిడ్జికి వచ్చాడు. వాళ్ల అల్లరికి తన అల్లరిని కూడా జోడించాడు.

అక్కడకి భార్య స్నేహా రెడ్డి, పిల్లలతో కలిసి ఫన్ రైడ్ చేసాడు అల్లు అర్జున్. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్నేహా రెడ్డి ఈ వీడియోను పోస్ట్ చేసింది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి టాప్ విజిటింగ్ స్పాట్‌గా మారిపోయింది. మరోవైపు నగరంలో నిర్విరామంగా వర్షాలు కురుస్తున్నా కూడా ప్రజలు మాత్రం బయటికి వస్తున్నారు.

అందులో సెలెబ్స్ కూడా ఉన్నారు. అలా బన్నీ తన కుటుంబంతో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా అక్కడ సందడి కనిపిస్తుంది. బన్నీ తన కారులో స్నేహారెడ్డితో పాటు అల్లు అర్హ, అయాన్ ఉన్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం అక్కడ ఎక్కువగా కనిపించలేదు.
Published by:Praveen Kumar Vadla
First published: