Allu Arjun Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్ సరికొత్త రికార్డు.. ‘సౌత్ కా సుల్తాన్’గా ఐకాన్ స్టార్..

అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్స్ (Allu Arjun)

Allu Arjun Instagram: సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు (Allu Arjun Instagram) ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలో మరే హీరోకు సాధ్యం కాని రీతిలో ఫాలోయర్స్ సంపాదించుకున్నారు ఐకాన్ స్టార్. ఈయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 13 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు.

  • Share this:
సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్.. ఏదైనా కూడా దున్నేస్తుంటాడు బన్నీ. తాజాగా మరో రికార్డు సొంతం చేసుకున్నారు ఈయన. సౌత్ ఇండస్ట్రీలో మరే హీరోకు సాధ్యం కాని రీతిలో ఫాలోయర్స్ సంపాదించుకున్నారు ఐకాన్ స్టార్. ఈయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఏకంగా 13 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. అంటే కోటి 30 లక్షల మంది ఫాలోయర్స్ సంపాదించుకున్నారు అల్లు అర్జున్. సౌత్ ఇండస్ట్రీలో ఈ రికార్డు అందుకున్న తొలి కథానాయకుడు ఈయనే కావడం గమనార్హం. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తెరిచిన నాలుగేళ్లలోనే ఈయన ఈ ఘనత అందుకోవడం విశేషం. 2017, నవంబర్‌లో అధికారికంగా ఇన్‌స్టాలోకి వచ్చారు అల్లు అర్జున్. అప్పటి నుంచి క్రమం తప్పకుండా అభిమానులతో తన విషయాలను పంచుకుంటూనే ఉన్నారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కూడా పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తూ వచ్చారు ఐకాన్ స్టార్.

మెల్లమెల్లగా ఫాలోయర్స్‌ను పెంచుకుంటూ.. ఇప్పుడు ఏకంగా 13 మిలియన్ మైలురాయిని అందుకున్నారు అల్లు అర్జున్. ఈ ఘనత సాధించిన తొలి సౌత్ ఇండియన్ హీరో అయ్యారు. అందుకే ఇప్పుడు అభిమానులు కూడా అల్లు అర్జున్‌ను సౌత్ కా సుల్తాన్ అని పిలుస్తున్నారు. సోషల్ మీడియాలో ఈయన తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు. తనకు 13 మిలియన్ ఫాలోయర్స్ రావడంపై అల్లు అర్జున్ కూడా ఆనందంగా ఫీల్ అయ్యారు. ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు అభిమానులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ట్విట్టర్‌లోనూ అల్లు అర్జున్‌కు 6 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. అలాగే ఫేస్ బుక్‌లో అయితే ఏకంగా 21 మిలియన్ ఫాలోయర్స్ సంపాదించుకున్నారు అల్లు అర్జున్.

Prabhas Saaho: ప్రభాస్ ‘సాహో’ సినిమాకు రెండేళ్లు.. 200 కోట్లు వసూలు చేసినా ఫ్లాప్ తప్పలేదు..



సౌత్ ఇండియాలో ఇప్పటికే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం నటిస్తున్న పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ స్టార్‌గా ఎదగడం ఖాయంగా కనిపిస్తుంది. పుష్ప: రి రైజ్ ఫస్ట్ లుక్, టీజర్‌కు అన్ని ఇండస్ట్రీల్లోనూ అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ ఒకేరోజు విడుదల కానుంది పుష్ప: ది రైజ్. ఇందులో మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్.
Published by:Praveen Kumar Vadla
First published: