హోమ్ /వార్తలు /movies /

Allu Arjun: టీం మెంబర్ పుట్టినరోజు సెలబ్రేట్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..

Allu Arjun: టీం మెంబర్ పుట్టినరోజు సెలబ్రేట్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..

Allu Arjun: ఎంత పెద్ద హీరో అయినా.. టీమ్‌ను ఎంత బాగా చూసుకున్నా కూడా ఎక్కడో ఓ చోట ఇద్దరి మధ్య చిన్న లైన్ అయితే ఉంటుంది. దాన్ని దాటి ఆ టీమ్ బాస్‌ను చేరుకోవడం కష్టమే. కానీ బన్నీ (Allu Arjun) మాత్రం ఆ బారియర్స్ అన్ని తొలగిస్తున్నాడు.

ఇంకా చదవండి ...

  ఎంత పెద్ద హీరో అయినా.. టీమ్‌ను ఎంత బాగా చూసుకున్నా కూడా ఎక్కడో ఓ చోట ఇద్దరి మధ్య చిన్న లైన్ అయితే ఉంటుంది. దాన్ని దాటి ఆ టీమ్ బాస్‌ను చేరుకోవడం కష్టమే. కానీ బన్నీ మాత్రం ఆ బారియర్స్ అన్ని తొలగిస్తున్నాడు. టీమ్ మెంబర్స్‌ను కూడా సొంత వ్యక్తుల్లా చూసుకుంటున్నాడు. అలాంటి హీరోలు చాలా అరుదుగా ఉంటారు. అందులో తాను కూడా ఉన్నానంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిరూపిస్తున్నాడు. ప్రతీసారి తన వాళ్ల పుట్టిన రోజు వేడుకలతో పాటు స్పెషల్ అకేషన్స్ అన్నీ గుర్తు పెట్టుకుని మరీ సెలబ్రేట్ చేస్తున్నాడు అల్లు అర్జున్. అది తన బాడీగార్డ్ కావచ్చు.. మేనేజర్ కావచ్చు.. పిఆర్ పెళ్లి కావచ్చు.. వేడుక ఏదైనా కూడా అక్కడ మొదటి గెస్ట్ మాత్రం అల్లు అర్జున్. అంతగా తన స్టాఫ్‌ను సొంత మనుషుల్లా చూసుకుంటాడు ఈయన.

  తాజాగా ఆయన కంటెంట్, డిజిటల్ హెడ్ అయినా శరత్ చంద్ర నాయుడు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిపాడు అల్లు అర్జున్. తన స్టాఫ్ బర్త్ డే వేడుకలు ఎలా సెలబ్రేట్ చేయడం ఇదే మొదటిసారి మాత్రమే కాదు. స్పెషల్ అకేషన్స్ అని అలాగే చేస్తుంటారు అల్లు అర్జున్. ఇలాంటి బాస్ దొరకడం నిజంగా అదృష్టం. ఆ మధ్య ఓసారి తన బాడీగార్డ్ పుట్టిన రోజు కూడా ఘనంగా జరిపాడు బన్నీ. అంతేకాదు.. పిఆర్ ఏలూరు శ్రీను పెళ్లి జరిగితే దానికి కూడా హాజరయ్యాడు అల్లు అర్జున్. ఇప్పుడు డిజిటల్ హెడ్ శరత్ చంద్ర పుట్టినరోజు వేడుకల్లో అల్లు అర్జున్ పర్ఫెక్ట్ హోస్ట్‌గా మారాడు.

  Prabhas - Dil Raju: ప్రభాస్‌ను క్షమాపణలు కోరిన దిల్ రాజు.. కారణం ఏంటంటే..?

  డిజిటల్ హెడ్ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆన్నీ ఆ కేక్ మీద హైలెట్ చేశారు. ఈ ఫోటోలను స్వయంగా అల్లు అర్జున్ తన ఇంస్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అలాగే శరత్ చంద్రతో ఉన్న ఫోటోలు కూడా ఇంస్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు అల్లు అర్జున్. గతేడాది కూడా శరత్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగానే జరిపాడు బన్నీ. అప్పుడు కూడా ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. దీన్ని బట్టి తన టీమ్ ను ఆయన ఎంత స్పెషల్ గా చూసుకుంటారో అర్థమవుతుంది. AA ఫ్యామిలీ (కుటుంబ సభ్యులతో పాటు స్టాఫ్ కూడా) ఈ పార్టీలో సందడి చేశారు. అలాగే చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా వచ్చారు.

  First published:

  ఉత్తమ కథలు