• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • TOLLYWOOD ICON STAR ALLU ARJU PARUGU MOVIE COMPLETED 13 YEARS AND ITS FINAL COLLECTIONS HERE PK

Parugu 13 years: అల్లు అర్జున్ ‘పరుగు’ సినిమాకు 13 ఏళ్లు.. ఎన్ని లాభాలు వచ్చాయంటే..!

Parugu 13 years: అల్లు అర్జున్ ‘పరుగు’ సినిమాకు 13 ఏళ్లు.. ఎన్ని లాభాలు వచ్చాయంటే..!

అల్లు అర్జున్ పరుగు సినిమాకు 13 ఏళ్లు పూర్తి (Allu Arjun Parugu movie)

Parugu 13 years: అప్పటికే దేశముదురు సినిమాతో కమర్షియల్ హీరోగా 25 కోట్ల మార్కెట్ సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్(Allu Arjun). దానికంటే ముందు ఆయన కెరీర్‌లో గంగోత్రి, ఆర్య, బన్నీ లాంటి సినిమాలున్నాయి. అలాంటి సమయంలో వచ్చింది పరుగు చిత్రం. ఇదొచ్చి 13 ఏళ్లు పూర్తైంది.

  • Share this:
అప్పటికే దేశముదురు సినిమాతో కమర్షియల్ హీరోగా 25 కోట్ల మార్కెట్ సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్. దానికంటే ముందు ఆయన కెరీర్‌లో గంగోత్రి, ఆర్య, బన్నీ లాంటి సినిమాలున్నాయి. దానికితోడు హ్యాపీ పర్లేదనిపించింది. అలాంటి సమయంలో వచ్చిన పరుగు సినిమాతో మరో విజయం అందుకున్నారు బన్నీ. 2007 సంక్రాంతికి విడుదలైన దేశముదురు సినిమా 28 కోట్ల వరకు వసూలు చేయడంతో.. పరుగు సినిమాకు కూడా అదే స్థాయి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసారు. బొమ్మరిల్లు లాంటి ఎమోషనల్ బ్లాక్‌బస్టర్ తెరకెక్కించిన తర్వాత భాస్కర్ తెరకెక్కించిన పరుగు సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. మే 1, 2008లో విడుదలైన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగానే కనెక్ట్ అయింది. ఎమోషన్స్ వర్కవుట్ కావడంతో సినిమా పర్లేదనిపించింది కానీ బ్లాక్‌బస్టర్ మాత్రం కాలేదు. 13 ఏళ్ళ కింద పరుగు సినిమా వసూలు చేసిన మొత్తం ఎంతో చూద్దాం..

నైజాం- 6.30 కోట్లు
సీడెడ్- 2.70 కోట్లు
ఉత్తరాంధ్ర- 3.13 కోట్లు
ఈస్ట్- 0.79 కోట్లు
వెస్ట్- 0.72 కోట్లు
గుంటూరు- 1.70 కోట్లు
కృష్ణా- 1.32 కోట్లు
నెల్లూరు- 0.76 కోట్లు

ఏపీ + తెలంగాణ - 17.42 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్- 2.61 కోట్లు
వరల్డ్ వైడ్- 20.03 కోట్లు

‘దేశముదురు’ పుణ్యమా అని పరుగు సినిమాను కూడా 18 కోట్లకు అమ్మారు. 13 ఏళ్ళ కింద 18 కోట్ల బిజినెస్ అంటే మాటలు కాదు. అలాంటిది థియెట్రికల్ రన్ ముగిసే సరికి పరుగు సినిమా 20.03 కోట్ల షేర్ వసూలు చేసింది. తద్వారా డిస్ట్రిబ్యూటర్లకు కోటిన్నరకు పైగా లాభాలు వచ్చాయి. షీలా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో తండ్రి పాత్రలో ప్రకాశ్ రాజ్ ప్రాణం పోసారు.
Published by:Praveen Kumar Vadla
First published: