Pooja Hegde in Cannes Film Festival : టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రతిష్ఠాత్మకమైన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్ నడిచి సందడి చేసింది. 75 కాన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో వైట్ కలర్ గౌనులో కలియ తిరుగుతూ ప్రేక్షకులను చూపు తిప్పుకోకుండా చేసింది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు భారత ప్రతినిధిగా పూజా హెగ్డే హాజరు అయ్యారు. ఈ ఏడాది కాన్స్‌లో జరిగే ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు ఈ నెల 17 నుంచి మొదలయ్యాయి.ఇప్పటకే తమన్నా, ఐశ్వర్యారాయ్, దీపికా పదుకొణే ఈ వేడుకలో సందడి చేసారు. ఈ వేడుకలు అక్కడ ఈ నెల 28 వరకు కొనసాగనున్నాయి. ఈ వేడుకల్లో భారత ప్రతినిధుల్లో ఒకరిగా నటి పూజ హెగ్డే హాజరైంది. తమ అభిమాన నటికి ఈ గౌరవం దక్కినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగుతో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్. దువ్వాడ జగన్నాథం మూవీ నుంచి వరుస సక్సెస్‌లతో ఉన్న ఈ భామ జైత్రయాత్రకు ప్రభాస్ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘రాధే శ్యామ్’ బ్రేకులు వేసింది.
రాధే శ్యామ్’ బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైన ఈ సినిమాలో ప్రేరణగా పూజా హెగ్డే నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ చిత్రంలో డాక్టర్ పాత్రలో మంచి నటనే కనబరిచింది. ఈ సినిమా ఫెయిలైన ఆ తర్వాత విజయ్‌తో ‘బీస్ట్’ చిరంజీవి, రామ్ చరణ్‌ల ‘ఆచార్య’ సినిమాలు అంతగా నడవకపోయినా.. పూజా హెగ్డే క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అంతేకాదు ఈ భామ ఇప్పటికే వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌తో ఫుల్లు బిజీగా ఉంది.పలు బాలీవుడ్... ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో ఫుల్ బిజీగా ఉంది. ఇక రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలతో వచ్చిన ఫ్లాప్స్‌ను రాబోయే సినిమాల సక్సెస్‌తో సమాధానం చెప్పాలని చూస్తోంది. ఇక బీస్ట్ సినిమా రూ. 250 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ బిజీగా ఉండే హీరోయిన్లలో పూజా హెగ్డే అందరికంటే ముందుంటుంది. ఎందుకంటే గత మూడేళ్ళుగా వరస సినిమాలు చేస్తూనే ఉంది పూజా.
ఇప్పటికే ‘రాధే శ్యామ్’ మూవీతో పలకరించింది. పూజా హెగ్డే విషయానికొస్తే.. రంగస్థలం తర్వాత ఎఫ్ 3 మూవీలో ఐటెం సాంగ్ చేస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాదు పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ సినిమా ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమాలో ఈమెనే నటిస్తోంది. ఇక దర్శకుడు హరీష్ శంకర్‌తో ఈమెకు ముచ్చటగా మూడో సినిమా. కేవలం తెలుగు మాత్రమే కాదు.. తమిళం, హిందీలోనూ పూజాకు అవకాశాలు వస్తున్నాయి. అన్ని భాషల్లోంచి వచ్చిన అవకాశాలను రెండు చేతులా అందిపుచ్చుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. కథలు నచ్చకపోతే కొన్ని సినిమాలను నిర్ధాక్షణ్యంగా నో చెప్తుంది కూడా. తెలుగులో ప్రస్తుతం మహేష్ బాబు,త్రివిక్రమ్ సినిమాలో ఈమె నటిస్తోంది. అటు మహేష్ బాబుతో వరుసగా రెండో సినిమా చేస్తోంది. అటు త్రివిక్రమ్‌తో ఈమెకు అరవింద సమేత వీరరాఘవ’, అల వైకుంఠపురములో’ సినిమా తర్వాత మరోసారి ఆయన దర్శకత్వంలో నటిస్తోంది.
Venkatesh assets : విక్టరీ వెంకటేష్ ఆస్తుల విలువ.. ఎన్ని వేల కోట్లు ఉన్నాయో తెలుసా..
అటు హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తోన్న ‘కభీ ఈద్ కభీ దివాళీ’ సినిమాలు చేస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ’ఈ నెల 12 నుంచి మొదలైంది. ఈ షూటింగ్లో పాల్గొంటూనే ఈమె కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. ఈమె రణ్వీర్ సింగ్‌తో చేస్తోన్న సర్కస్ సినిమా జూలై 15న విడుదల కానుంది. మొత్తంగా భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దుమ్ము దులుపుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cannes Film Festival, Pooja Hegde, Tollywood