• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • TOLLYWOOD HOT ANCHOR ANASUYA BHARADWAJ SAID ABOUT UPPENA DIRECTOR BUCHI BABU NR

Anasuya Bharadwaj: ఆ డైరెక్టర్ చాలా క్లోజ్.. పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంటానంటున్న అనసూయ!

Anasuya Bharadwaj: ఆ డైరెక్టర్ చాలా క్లోజ్.. పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంటానంటున్న అనసూయ!

Anasuya Bharadwaj

  • Share this:
    Anasuya Bharadwaj: బుల్లితెర యాంకర్ హాట్ గ్లామర్ బ్యూటీ అనసూయ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. అంతే కాకుండా తన గ్లామర్ తో కుర్రాళ్ల మతి పోగొడుతుంది అనసూయ. రంగమ్మత్తగా అందరి మనుసులో నిలిచింది. అంతేకాకుండా వయసుతో పాటు తన అందాన్ని కూడా పెంచుకుంటుంది ఈ గ్లామర్ బ్యూటీ. ఇక వెండితెరపై కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. బుల్లితెరలో కూడా స్టార్ యాంకర్ గా నిలిచింది.



    ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో లో యాంకరింగ్ చేస్తూ బుల్లి తెరకు పరిచయమైన అనసూయ.. అంతకు ముందే కొన్ని సినిమాల్లో నటించింది. కానీ జబర్దస్త్ తర్వాతే మంచి గుర్తింపు అందుకుంది. అంతేకాకుండా జబర్దస్త్ తర్వాత వెండితెర లో కూడా మంచి క్రేజ్ అందుకుంది. ఇదిలా ఉంటే తాను రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా లో రంగమ్మత్తగా బాగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే అనసూయ తన పర్సనల్ విషయాలను అతనితో బాగా షేర్ చేసుకునేదట. ఇంతకీ అతను ఎవరంటే..



    ఇటీవల ఉప్పెన సినిమాతో మంచి క్రేజ్ అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు సానా గురించి అందరికీ తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ.. కొన్ని విషయాలు పంచుకుంది. రంగస్థలం షూటింగ్ సమయంలో తనని అందరూ రంగమ్మత్త అని పిలిచేవారు అని తెలిపింది. అంతేకాకుండా సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ బుచ్చిబాబు కూడా తనను రంగమ్మత్త అని పిలిచేవాడట. ఇక ఆ టైమ్ లో సెట్ లో అనసూయ, బుచ్చి బాబు..ఇద్దరు చాలా సరదాగా ఉండేవారట.



    రంగస్థలం సమయంలోనే బుచ్చిబాబు తో మంచి స్నేహం ఏర్పడిందని, అప్పటినుండి తన పర్సనల్ విషయాలు కూడా అతనితో బాగా షేర్ చేసుకునేదని తెలిపింది. అంతేకాకుండా ఇండస్ట్రీలో తనకు క్లోజ్ అయిన వ్యక్తి కూడా బుచ్చిబాబు అని తెలిపింది. ఇక ఆయన ఉప్పెన సినిమా షూటింగ్ తన ఇంటి దగ్గర లోనే జరుగుతుందని ఫోన్ చేసి తెలిపాడట‌ అనసూయకు.



    అంతే కాకుండా విజయ్ సేతుపతి కూడా ఉన్నారని ఆయనను కలవచ్చని తెలిపాడట‌. ఇక వెంటనే తాను షూటింగ్ స్పాట్ కు.. వెళ్లి విజయ్ సేతుపతి ని కలిసానని తెలిపింది. అంతే కాకుండా విజయ్ సేతుపతి అంటే తనకు పిజ్జా సినిమా నుంచి ఇష్టమని, అక్కడ 96 చూశాక ఇంకా నచ్చేశాడని తెలిపింది. ఇక అలా జరిగిన పరిచయంతోనే చెన్నై కి వెళ్ళినప్పుడు కూడా అతనిని కలిశానని చెప్పుకొచ్చింది అనసూయ. ఇదిలా ఉంటే అనసూయ నటించిన థాంక్యూ బ్రదర్ సినిమా నిన్న విడుదల కాగా ప్రేక్షకులను కొంతవరకు బానే ఆకట్టుకుందని తెలిసింది. ఇదిలా ఉంటే పుష్ప సినిమాలో నెగటివ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
    Published by:Navya Reddy
    First published:

    అగ్ర కథనాలు