పాయల్ రాజ్‌పుత్ బాయ్ ఫ్రెండ్ ఇతడే.. ఫ్యాన్స్‌కు హార్ట్ ఎటాక్..

Payal Rajput: ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ముఖ్యంగా కుర్రాళ్లకు ఆ సినిమాతో నిద్ర లేకుండా చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసినా..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 26, 2020, 11:04 PM IST
పాయల్ రాజ్‌పుత్ బాయ్ ఫ్రెండ్ ఇతడే.. ఫ్యాన్స్‌కు హార్ట్ ఎటాక్..
బాయ్ ఫ్రెండ్‌తో పాయల్ రాజ్‌పుత్ (payal rajput)
  • Share this:
ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ముఖ్యంగా కుర్రాళ్లకు ఆ సినిమాతో నిద్ర లేకుండా చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసినా కూడా ఏది ఈమెకు కలిసిరాలేదు. వెంకీ మామ లాంటి సినిమాలు బాగానే ఆడినా కూడా ఎందుకో క్రేజ్ రాలేదు. డిస్కో రాజా లాంటి సినిమాలు వచ్చి వెళ్లిపోయాయి. దాంతో ఎలాగైనా ఇక్కడ క్రేజ్ తెచ్చుకోవాలని మ్యాగ్జిమమ్ ట్రై చేస్తుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అందరికీ షాక్ ఇచ్చింది పాయల్. తన బాయ్ ఫ్రెండ్‌ని ప్రేక్షకులకు పరిచయం చేసి కుర్రాళ్లకు హార్ట్ ఎటాక్ తెప్పించింది. ఆయన పేరు సౌరభ్ డింగ్రా అని ముద్దుగా చెప్పింది పాయల్.
బాయ్ ఫ్రెండ్‌తో పాయల్ రాజ్‌పుత్ (payal rajput)
బాయ్ ఫ్రెండ్‌తో పాయల్ రాజ్‌పుత్ (payal rajput)

సోషల్ మీడియాలో తన ప్రియుడిని పరిచయం చేసింది. అతడితో చెట్టపట్టాలేసుకుని భుజాలపై వాలిపోయింది పాయల్. ముంబైలో మోడల్‌ ప్రేమలో పడిపోయింది ఈ బ్యూటీ. ఒకానొక సందర్భంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని చెబుతుంది ఈమె. ఈ ఇద్దరూ కొన్ని రోజులుగా డేటింగ్ చేస్తున్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణం అని చెప్పేస్తుంది ఈ భామ. తాజాగా సౌరభ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ ఇద్దరూ మంచి జోరులో ఉన్నపుడు ఫోటోలు తీసి అప్ లోడ్ చేసింది పాయల్. పనిలో పనిగా తన ప్రేమ విషయాన్ని కూడా చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఇద్దరి మధ్య వున్న అనుబంధాన్ని పాయల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. తన లోపాలని ఇష్టపడే ఏకైక వ్యక్తి అంటూ తన ప్రియుడి పుట్టిన రోజు వేడుకలని ఘనంగా జరిగింది ఈ భామ. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

First published: February 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు