ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ముఖ్యంగా కుర్రాళ్లకు ఆ సినిమాతో నిద్ర లేకుండా చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసినా కూడా ఏది ఈమెకు కలిసిరాలేదు. వెంకీ మామ లాంటి సినిమాలు బాగానే ఆడినా కూడా ఎందుకో క్రేజ్ రాలేదు. డిస్కో రాజా, RDX లవ్ లాంటి సినిమాలు వచ్చి వెళ్లిపోయాయి. దాంతో ఎలాగైనా ఇక్కడ క్రేజ్ తెచ్చుకోవాలని మ్యాగ్జిమమ్ ట్రై చేస్తుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో అందరికీ షాక్ ఇచ్చింది పాయల్.

బాయ్ ఫ్రెండ్‌తో పాయల్ రాజ్‌పుత్ (payal rajput)
తన బాయ్ ఫ్రెండ్‌ని ప్రేక్షకులకు పరిచయం చేసి కుర్రాళ్లకు హార్ట్ ఎటాక్ తెప్పించింది. ఆయన పేరు సౌరభ్ డింగ్రా అని ముద్దుగా చెప్పింది పాయల్. సోషల్ మీడియాలో తన ప్రియుడిని పరిచయం చేసింది. అతడితో చెట్టపట్టాలేసుకుని భుజాలపై వాలిపోయింది పాయల్. ముంబైలో మోడల్ ప్రేమలో పడిపోయింది ఈ బ్యూటీ. ఒకానొక సందర్భంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని చెబుతుంది ఈమె. ఈ ఇద్దరూ కొన్ని రోజులుగా డేటింగ్ చేస్తున్నారు.

బాయ్ ఫ్రెండ్‌తో పాయల్ రాజ్‌పుత్ (payal rajput)
ఒకరంటే ఒకరికి ప్రాణం అని చెప్పేస్తుంది ఈ భామ. ఆ మధ్య సౌరభ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ ఇద్దరూ మంచి జోరులో ఉన్నపుడు తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పుడే పనిలో పనిగా తన ప్రేమ విషయాన్ని కూడా చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఇద్దరి మధ్య వున్న అనుబంధాన్ని పాయల్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. తన లోపాలని ఇష్టపడే ఏకైక వ్యక్తి అంటూ తన ప్రియుడి పుట్టిన రోజు వేడుకలని ఆ మధ్య ఘనంగా జరిపింది ఈ భామ. భవిష్యత్తులో తననే పెళ్లి చేసుకుంటానని చెబుతుంది ఈ RDX బ్యూటీ.
Published by:Praveen Kumar Vadla
First published:April 15, 2020, 14:38 IST